సర్పంచ్ (Sarpanch) వేలం పాటలు.. పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) ఓటర్ల జాడలేదు.. సంతలోన సరుకులాగ సర్పంచ్‌ల పదవులాయే.. పోటీలోన నెగ్గినోడు సర్పంచ్ అయిపోయే.. గ్రామ సర్పంచ్ అయిపోయే పాంచ్ సాల్ సర్పంచ్ పదవి ఏక్ బార్! దో బార్! తీన్ బార్ సర్పంచ్ బన్‌గయా!.. వినాయకుడి లడ్డు(Vinayaka Laddu)లా వేలమేస్తున్నరు.. అవినీతిపరులంతా (Corrupt People) పోటీపడుతున్నరు.. ఓటింగ్ (Voting) లేకుండా నోట్లతో కొంటున్నరు.. ప్రజాస్వామ్య పాలనను పాతరేస్తున్నరు.. చదువుకున్న యువతరం ఏం జేస్తున్నది.. ఊరిలోని ఓటర్లు ఎందుకు ఎదిరించరు?.. ఎలక్షన్ కమిషన్ ఎక్కడ దాగున్నది.. వేలంలో కొంటే ఇక ఎలక్షన్స్ ఎందుకు? ఓటు హక్కు ఎందుకు? ప్రజాస్వామ్యమెందుకు.? ఓటు హక్కు కలిగినట్టి.. ప్రతి పౌరుడు ప్రశ్నించి ప్రజాస్వామ్యాన్ని కాపాడగ కదలండి
- గడ్డమీది చంద్రమోహన్ గౌడ్
