Friday, September 12, 2025
ePaper
spot_img
Homeతెలంగాణరాజ్యాంగంలో కళాత్మకత, కాలిగ్రఫీపై ప్రత్యేక ప్రదర్శన

రాజ్యాంగంలో కళాత్మకత, కాలిగ్రఫీపై ప్రత్యేక ప్రదర్శన

  • ప్రారంభించిన తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘రాజ్యాంగంలో కళాత్మకత, కాలిగ్రఫీ’పై హైదరాబాద్ లోని విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) ప్రాంతీయ కార్యాలయాలు, ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం, ఎంఈఏ శాఖా సచివాలయం ఓ ప్రదర్శనను నిర్వహించాయి. గౌరవ తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుక్రవారం ఈ ప్రదర్శనను ప్రారంభించారు. జనవరి 24వ తేదీకి గల చారిత్రక ప్రాధాన్యం ఇక్కడ గమనార్హం. 1950లో ఇదే రోజున భారత రాజ్యాంగ నిర్మాణ సభలోని 284 మంది సభ్యులు చేతితో రాసిన మౌలిక భారత రాజ్యాంగంపై సంతకాలు చేశారు. భారత రాజ్యాంగం ప్రాథమికమైన చట్టబద్ధమైన పత్రం మాత్రమే కాదు, కాల పరీక్షకు నిలిచిన కళాఖండం కూడా. సుసంపన్నమైన, బహువిధమైన భారతీయ చరిత్రను రాజ్యాంగంలోని సంక్లిష్టమైన కళ ప్రతిబింబిస్తుంది. దేశ సామాజిక-సాంస్కృతిక, పౌరాణిక, ఆధ్యాత్మిక, ప్రాంతీయ, భౌతిక వైవిధ్యాన్ని అది చాటుతుంది. భవిష్యత్ దార్శనికతను రూపొందిస్తూనే ప్రాచీన వారసత్వానికీ ప్రాధాన్యమిస్తూ భారత విశిష్టత అయిన భిన్నత్వంలో ఏకత్వానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. భారత రాజ్యాంగ వారసత్వం, రూపకల్పన స్ఫూర్తితో హైదరాబాద్ లోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం గతంలోనే ప్రత్యేక ఎన్వలప్ ను ప్రారంభించిన విషయం గమనార్హం. రాజ్యాంగ ప్రాధాన్యాన్ని శాశ్వతంగా చాటేలా, పాస్ పోర్టులను పంపిణీ చేయడం కోసం ఈ ప్రత్యేక ఎన్వలప్ లను ఉపయోగిస్తున్నారు. గవర్నర్ సందర్శన సమయంలో.. హైదరాబాద్ ఎంఈఏ శాఖ, ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయ కార్యదర్శి, ఐఎఫ్ఎస్ అధికారి శ్రీమతి జె. స్నేహజ ఆయన వెంట ఉన్నారు. భారత మాజీ దౌత్యాధికారులు (విశ్రాంత), పీఐబీ – సీబీసీ అదనపు డైరెక్టర్ శ్రీమతి శ్రుతి పాటిల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పొడవునా నిర్వహించే వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయంలో ఈ ప్రదర్శన సంవత్సరం మొత్తం జరుగుతుంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News