ఐదుగురు మావోయిస్టులు మృతి
అమరుడైన ఓ పోలీస్.. మరో జవాన్‌కి గాయాలు..
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని గంగలూర్ ఫారెస్ట్ ఏరియాలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు (Maoists) మృతిచెందారు. ఒక పోలీస్ (Police) అమరుడు కాగా మరో పోలీస్‌కి గాయాలయ్యాయి. ఇరు వర్గాల మధ్య కాల్పులు, ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. గంగలూరు అటవీ ప్రాంతం దంతెవాడ జిల్లాకు ఆనుకొని ఉంటుంది.
పోలీస్ విభాగంలోని డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(District Reserve Guard)కి, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, భద్రతా దళాలు నక్సల్స్ ఏరివేతకు వెళ్లగా నక్సలైట్లు ఫైరింగ్(Firing)కి దిగారు. నక్సల్స్ మృతదేహాలను ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ జవాన్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
