ఈ నెల 17, 18 తేదీల్లో ఆ దేశంలో మోదీ పర్యటన
ఇండియా, ఒమన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(Free Trade Agreement) కుదరనుంది. ఇరు దేశాల ప్రభుత్వాలూ ఈ మేరకు అంగీకారం తెలిపాయి. ప్రధాని మోదీ (PM Modi) ఒమన్ పర్యటన(Oman Tour)లో ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయి. ప్రధాని మోదీ ఈ నెల 17, 18 తేదీల్లో గల్ఫ్ దేశమైన (Gulf Country) ఒమన్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా 2 దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదరనుంది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ (Cabinet Green Signal) ఇచ్చింది. ఇండియా, ఒమన్ మధ్య సుదీర్ఘకాలంగా వాణిజ్య, ఇంధన సహకారం కొనసాగుతోంది. ఆ దేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం 2023 నవంబర్‌లో చర్చలు ప్రారంభమయ్యాయి.
అధికారిక గణాంకాల ప్రకారం ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక వాణిజ్యం నెలకొంది. 2023-24 నాటికి ఈ ట్రేడ్ వ్యాల్యూ 8.947 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఇది 2024-25లో 10.613 బిలియన్ డాలర్లకు పెరిగింది. పెట్టుబడుల ప్రవాహం కూడా వృద్ధి చెందింది. 6 వేల ఇండియా-ఒమన్ జాయింట్ వెంచర్లు ఆ దేశంలో నడుస్తున్నాయి. వీటి క్యాపిటల్ వ్యాల్యూని 7.5 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఇండియాలోకి ఒమన్ ఎఫ్‌డీఐ ఈక్విటీ ఇన్‌ఫ్లోస్ 2000 సంవత్సరం ఏప్రిల్ నుంచి కొనసాగుతున్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి 605.57 మిలియన్ యూఎస్ డాలర్లకు చేరాయి.
