హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక SU TPGL 2025 టోర్నమెంట్ (Tournament) తుది దశకు చేరుకుంది. అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శిస్తూ లీగ్ మొత్తంలో ఆధిపత్యం చూపిన మీనాక్షి మావెరిక్స్(Meenakshi Mavericks), శ్రీనిధి థండర్‌బోల్ట్స్ (Srinidhi Thunderbolts) జట్లు హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ (Hyderabad Golf Association)లో జరగబోయే గ్రాండ్ ఫినాలే(Grand Finale)లో టైటిల్ (Title) కోసం తలపడనున్నాయి.
క్వాలిఫయర్స్ అంతటా అద్భుత ప్రదర్శనలు ఇచ్చిన ఈ రెండు జట్లు ఫైనల్ స్థానాన్ని సమర్థంగా సంపాదించాయి. మీనాక్షి మావెరిక్స్ స్థిరమైన ఫామ్‌తో మెరిసింది. ముఖ్యంగా వాలీ వారియర్స్‌పై జరిగిన టై బ్రేకర్‌లో సాధించిన కీలక విజయంతో ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఇక, శ్రీనిధి థండర్‌బోల్ట్స్.. క్వాలిఫయర్ 2లో 5.5 పాయింట్ల ఘన విజయంతో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ ఏడాది గ్రాండ్ ఫినాలే ప్రతిష్ఠ, వ్యూహం, అధిక ఒత్తిడిలో ప్రదర్శన వంటి అంశాల సమ్మేళనంగా ఉండబోతోంది.
గోల్ఫ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ తుది పోరులో రెండు జట్లూ SU TPGL 2025 కిరీటాన్ని కైవసం చేసుకునేందుకు ప్రతిభను కనబరచనున్నాయి. సెమీ ఫైనల్ స్కోర్ ఇలా ఉంది.. శ్రీనిధి థండర్‌బోల్ట్స్ 5.5 పాయింట్లు, మీనాక్షి మావెరిక్స్ 3.0 పాయింట్లు.
