Saturday, October 4, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుగ్రేటర్ హైదరాబాద్‌లో ఫేక్ సర్టిఫికెట్ల బండారం బట్టబయలు

గ్రేటర్ హైదరాబాద్‌లో ఫేక్ సర్టిఫికెట్ల బండారం బట్టబయలు

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో జరుగుతున్న ఫేక్ సర్టిఫికెట్ల బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. బల్దియాలో 23 వేల నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలను గుర్తించారు. ఈ ముఠాను నార్సింగి మునిసిపాలిటీలో పట్టుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 22,906 తప్పుడు ధ్రువీకరణ పత్రాలను జీహెచ్ఎంసీ క్యాన్సిల్ చేసింది. ఇందులో బర్త్ సర్టిఫికెట్లు 21,001 కాగా.. డెత్ సర్టిఫికెట్లు 1,906 ఉన్నాయి. అత్యధికంగా మెహిదీపట్నంలో 5,403 బర్త్ సర్టిఫికెట్లను గుర్తించారు. తర్వాత.. చార్మినార్‌లో 3,256, బేగంపేట్‌లో 2,123, సికింద్రాబాద్‌లో 1,511, ఫలక్‌నుమా సర్కిల్ పరిధిలో 1,383 ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నట్టు తేలింది. డెత్ సర్టిఫికెట్లు ఎక్కువగా బేగంపేట్ సర్కిల్ పరిధిలో 251 ఉన్నాయి. తర్వాత.. మెహిదీపట్నం సర్కిల్‌లో 186 ఉన్నాయని అధికారులు లెక్కలు తీశారు. ఫేక్ సర్టిఫికెట్లను జారీచేయడానికి సహకరించిన హెల్త్ అసిస్టెంట్లు, కంపూటర్ ఆపరేటర్లు, మెడికల్ ఆఫీసర్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News