Saturday, March 7, 2026
Homeరంగారెడ్డిBrother | తమ్ముడి తప్పుకు అన్న బలి

Brother | తమ్ముడి తప్పుకు అన్న బలి

ఎల్లంపల్లి వ్యక్తి యేన్మనగండ్లలో హత్య
తన కుమార్తెను ఒక సామాజికవర్గం యువకుడు పెళ్లి చేసుకున్నాడని పగతో రగిలిపోయిన తండ్రి
షాద్ నగర్ ఇంటి నుంచి అతని అన్నను అపహరించి హత్య, దహనం
కేసును చేధించిన పోలీసులు
మృతుడు ఎర్ర రాజశేఖర్‌గా గుర్తింపు

షాద్ నగర్, నవంబర్ 16 (ఆదాబ్ హైదరాబాద్): నవాబుపేట మండలం యన్మన్‌గండ్ల గేట్ దగ్గర గురువారం లభించిన గుర్తుతెలియని యువకుడి మృతదేహం ఆచూకీ శనివారం దొరికింది. ఎక్కడో చంపి మృతదేహాన్ని ఇక్కడికి తెచ్చి దానిపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఆనవాళ్లు లేకుండా చేసి హంతకులు పరారయ్యారు. దీంతో.. గుర్తుతెలియని యువకుడి హత్యగా కేసు (Mur*der Case) నమోదు చేసిన పోలీసులు దీన్నో సవాల్‌గా తీసుకొని 3 రోజుల వ్యవధిలో ఛేదించారు. ఇది పరువు హత్య (Honor Killing) అయుండొచ్చని భావిస్తున్నారు. హంతకుల్లో ఒకరి కూతురి(Daughter)తో హతుడి సోదరుడు పరారు (Jump) కావడమే హత్యకు కారణమని విశ్వసనీయ వర్గాల సమాచారం.

- Advertisement -

హతుడిని ఫరూఖ్ నగర్ మండలం ఎలికట్ట గ్రామ సమీపంలోని ఎల్లంపల్లికి చెందిన ఎర్ర రాజశేఖర్(35)గా గుర్తించారు. ఒక సామాజిక వర్గానికి చెందిన చంద్రశేఖర్(రాజశేఖర్ సోదరుడు) అదే గ్రామానికి చెందిన మరో సామాజిక వర్గంలోని ఓ కులానికి చెందిన యువతితో కలిసి ఎక్కడికో వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న ఆమె తండ్రి.. మరికొందరితో కలిసి వారి ఆచూకీ కోసం ప్రయత్నించారు. ఎక్కడా కూడా వారి ఆచూకీ లభించకపోవడంతో షాద్ నగర్ (Shad Nagar) అయ్యప్ప కాలనీ(Ayyappa Colony)లో ఆరేళ్లుగా ఉంటున్న రాజశేఖర్ ఇంటికి వెళ్లి అతణ్ని కిడ్నాప్ (Kidnap) చేసి వెంట తీసుకెళ్లారు. రాజశేఖర్‌ను కిడ్నాప్ చేసిన వెంటనే ఆయన భార్య.. షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆలోగా రాజశేఖర్‌ను హత్య చేసి యేన్మన్‌గండ్ల గేట్ ప్రాంతానికి తీసుకొచ్చారు. అక్కడ మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. చంద్రశేఖర్ చేసిన పనే అతని సోదరుడు రాజశేఖర్ హత్యకు దారితీసిందని ఎల్లంపల్లి గ్రామస్తులు అనుమానిస్తున్నారు. పోలీసులు శనివారం ఎల్లంపల్లికి వెళ్లి తమదైన శైలిలో విచారణ (Enquiry) జరిపి వివరాలు సేకరించారు. మరిన్ని విషయాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. తమ్ముడి తప్పుకు అన్న బలి కావడంపై ఎల్లంపల్లి గ్రామస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర్ మృతి అతని కుటుంబానికి తీరని లోటని ఆవేదన వెలిబుచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News