- టెక్ దిగ్గజం యాపిల్ కొత్త సాఫ్ట్ వేర్..New iPhone
- ఐ ఫోన్ డ్యుయో కోసం ఆసక్తికరమైన ఫీచర్లు..
టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త సాఫ్ట్వేర్ (New iPhone) అప్డేట్ 27.3 రెండో డెవలపర్ బీటాను విడుదల చేసింది. ఈ అప్డేట్లో తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ డ్యూయో కోసం పలు ఆసక్తికరమైన కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. దీంతో పాటు సిరి సామర్థ్యాలను, యాపిల్ టీవీ యాప్ సేవలను కూడా విస్తరించింది. ఐఫోన్ డ్యూయో కోసం తీసుకొచ్చిన ఫీచర్లలో ప్రధానమైనది ఫ్రంట్ కెమెరా అన్‌లాక్. ఐఫోన్ డ్యూయో మూసి ఉన్నప్పటికీ, ఇటీవల టచ్ ఐడీ లేదా పాస్‌కోడ్‌తో అన్‌లాక్ చేసి ఉంటే, ఫ్రంట్ కెమెరా ద్వారా సులభంగా అన్‌లాక్ చేయవచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు.
దీంతో పాటు ఫోన్‌ను మూసివేసిన వెంటనే ఆటోమేటిక్‌గా లాక్ అయ్యేలా ‘క్లోజ్ టు లాక్’ అనే కొత్త ఆప్షన్‌ను కూడా యాపిల్ తీసుకొచ్చింది. ఈ అప్డేట్లో సిరి సామర్థ్యాలను కూడా యాపిల్ మరింత మెరుగుపరిచింది. సఫారీ బ్రౌజర్లో ‘ఆస్క్ అబౌట్ పేజ్’ అనే కొత్త ఫీచర్ ద్వారా, యూజర్లు వెబ్‌పేజీలోని పూర్తి సమాచారం గురించి సిరిని ప్రశ్నలు అడగవచ్చు. ఉదాహరణకు, ఒక పెద్ద ఆర్టికల్ సారాంశం చెప్పమన్నా, రెస్టారెంట్ మెనూలో గ్లూటెన్-ఫ్రీ ఐటమ్స్ ఏవో చెప్పమన్నా సిరి సులభంగా గుర్తించి సమాచారం ఇస్తుంది.
అంతేకాకుండా యాపిల్ పాడ్‌కాస్ట్‌లలో అందుబాటులో ఉన్న వీడియో ఎపిసోడ్లను ఇప్పుడు యాపిల్ టీవీ యాప్‌లో కూడా వీక్షించవచ్చు. కాగా, తన ఫోల్డబుల్ ఫోన్‌కు డెవలపర్ల మద్దతు పెరుగుతోందని, ఇప్పటికే 2 లక్షలకు పైగా యాప్స్ ఐఫోన్ డ్యూయోకు అనుకూలంగా ఆప్టిమైజ్ చేసినట్లు యాపిల్ తెలిపింది. ప్రస్తుతం డెవలపర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ బీటా వెర్షన్‌ను, పూర్తిస్థాయి పరీక్షల అనంతరం సాధారణ యూజర్లకు విడుదల చేసే అవకాశం ఉంది. యాపిల్ తన ఐఫోన్ డ్యూయోను ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
