Homeఆంధ్రప్రదేశ్Cyclone Akwan | అక్వాన్ తుఫాను అలెర్ట్..

Cyclone Akwan | అక్వాన్ తుఫాను అలెర్ట్..

  • అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం..Cyclone Akwan
  • ఉన్నతాధికారులతో సీఎం టెలి కాన్ఫరెన్స్..

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ (Cyclone Akwan) తుపాను తీరం దిశగా దూసుకువస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను తీవ్రత, కదలికలు, ముందస్తు జాగ్రత్తలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తాజా పరిస్థితులను సమీక్షించిన సీఎం, విపత్తు నిర్వహణ విభాగంతో పాటు తీరప్రాంత జిల్లాల యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేశారు. వాతావరణ శాఖ వివరాల ప్రకారం..

ప్రస్తుతం అక్వాన్ తుపాను చెన్నైకి 610 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 660 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 670 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 19, 20 తేదీల్లో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు సీఎంకు వివరించారు.

- Advertisement -

తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని, హెచ్చరికలను పంపేందుకు పటిష్ఠమైన సమాచార వ్యవస్థను అందుబాటులో ఉంచాలని చంద్రబాబు ఆదేశించారు. ఇందులో భాగంగా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బందిని క్షేత్రస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. సిబ్బంది నేరుగా ప్రజల వద్దకు వెళ్లి తుపాను ముప్పుపై అవగాహన కల్పించాలని, అవసరమైన రక్షణ చర్యలపై వారికి సమాచారం అందించాలని ఆదేశించారు.

సముద్రం అల్లకల్లోలంగా మారే సూచనలు ఉండటంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News