Homeభక్తిUjjain Kalabhairava Temple | మద్యం సేవించే శివయ్య..

Ujjain Kalabhairava Temple | మద్యం సేవించే శివయ్య..

  • ఉజ్జయిని కొత్వాల్ భైరవుడి విశేషం..Ujjain Kalabhairava Temple
  • మరాఠా శైలిలో ఆలయ నిర్మాణం..Ujjain Kalabhairava Temple
  • మహాకాళేశ్వర ఆలయానికి క్షేత్రపాలకుడు..

పరమేశ్వరుని దుర్భాషలాడిన వారిని శిక్షించేందుకు జన్మించిన శివాంశ సంభూతుడు కాలభైరవుడు (Ujjain Kalabhairava Temple). శునకంపై సంచరిస్తూ శైవ క్షేత్రాలను కాపాడటమే ఈయన కర్తవ్యం. ప్రముఖ జ్యోతిర్లింగాలైన కాశీతో పాటు ఉజ్జయిని క్షేత్రానికి కూడా కాలభైరవుడే క్షేత్ర పాలకుడు. మధ్యప్రదేశ్ లో వెలసిన కాలభైరవ స్వామి ఆలయం శాస్త్రజ్ఞులు చేధించలేని అనేక రహస్యాలు నిలయంగా విరాజిల్లుతోంది. సకల గ్రహ దోషాలు తొలగించే ఈ శివాంశుజుడు ఆలయ విశేషాలేంటో చూద్దాం. భీకర రూపంతో కొన్ని చోట్ల చతుర్భుజాలతో, మరికొన్ని చోట్ల నగ్నంగా కనబడే శివాంశుజుడు కాలభైరవుడు. శునక వాహనంపై విహరించే నిశాచర దైవం కాలభైరవుడు. ప్రముఖ శైవ క్షేత్రాల్లో క్షేత్ర పాలకుడిగా వ్యవహరించే కాలభైరవుడు దాదాపు అన్ని శివాలయాల్లోను దర్శనమిస్తాడు. పరమేశ్వరుని ‘గోరు’ నుంచి సంభవించిన శివాంశ సంభూతుడు కాలభైరవుడు. ‘నేనే సర్వోత్తముణ్ణి’ అని విర్రవీగుతున్న బ్రహ్మదేవుని ఇదో శిరస్సును ఖండించిన శివ అనుచర గణం కాలభైరవుడు వెలసిన ఉజ్జయిని ఆలయ విశేషాలు.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో క్షిప్రా నది ఒడ్డున ప్రసిద్ధ జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం వెలసి ఉంది. మహాకాళేశ్వరుని ఆలయానికి 7 కిలోమీటర్ల దూరంలో కాలభైరవ దేవాలయం ఉంది. ఈశ్వరాంశతో ఆవిర్భవించిన ఉజ్జయిని కొత్వాల్ కాలభైరవుడు, ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తున్నాడు. శివ దూషణ చేసిన వారిని అంతమొందించడమే కాలభైరవుని కర్తవ్యం. ఆదిశంకరాచార్యులంతటి వారు కాలభైరవాష్టకం రచించారంటే కాలభైరవుని మహత్యం ఏమిటో అర్ధమవుతుంది.

ఆలయ నిర్మాణం మొత్తం మరాఠా శైలిలో ఉంటుంది. 1761 లో జరిగిన 3వ పానిపట్ యుద్ధం తర్వాత మరాఠా జనరల్ మహదాజీ షిండే తన తలపాగాను స్వామికి సమర్పించి విజయం సాధించిన తరువాత ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయించాడని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆనాటి నుంచి స్వామి వెండి తలపై మరాఠా శైలి పగ్రీ అలంకరించబడి ఉంటుంది. కాలభైరవ స్వామి విగ్రహం మొత్తం సింధూరంతో అలంకరిచంబడి ఉంటుంది. స్వామిని దర్శించగానే భక్తులు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతారు.
ఉజ్జయినిలో వెలసిన కాలభైరవ స్వామి ఆలయ ప్రస్తావన స్కాంద పురాణంలోని ‘అవంతి ఖండం’లో కనిపిస్తుంది. భద్రసేనుడు అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడి ప్రజల నమ్మకం. ఉజ్జయినిలో కాలభైరవ స్వామి ఆలయంలో కాలభైరవ స్వామికి మద్యం నైవేద్యంగా సమర్పించడం ఈ క్షేత్రంలోని ప్రధాన ప్రత్యేకత. ఇందులో భాగంగా పూజారి ఒక చిన్న పళ్లెంలో మద్యాన్ని ఉంచి కాలభైరవ స్వామి నోటిలో నుంచి ఆ మద్యం పోస్తే, ఆ మద్యం విగ్రహం లోపలకు వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కాలభైరవ స్వామి విగ్రహం మద్యం త్రాగుతుంది అని అందరి విశ్వాసం. ఇది శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని ఒక మిస్టరీగా మిగిలిపోయింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News