Homeబిజినెస్Gold and Silver Prices Drop | తగ్గిన గోల్డ్ రేట్స్..

Gold and Silver Prices Drop | తగ్గిన గోల్డ్ రేట్స్..

  • అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ధోరణులు..Gold and Silver Prices Drop
  • వరుసగా నాలుగో సెషన్ లోనూ తగ్గుదల..Gold and Silver Prices Drop

బంగారం ధరలు మరింత దిగొచ్చాయి (Gold and Silver Prices Drop). దీపావళి తర్వాత డిమాండ్‌ మందగించడం, అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ధోరణుల ప్రభావంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో బంగారం ధరలు వరుసగా నాలుగో సెషన్‌లోనూ రూ.2,500 తగ్గి రూ.1,40,900కు చేరాయి. గత కొన్ని రోజులుగా యథాతథంగా కొనసాగిన వెండి ధరలు భారీగా పడిపోయాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉండటంతో కిలో వెండి అన్ని పన్నులు కలుపుకొని రూ.3,500 తగ్గి రూ.1,84,000కు చేరింది. ‘అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం, దీపావళి పండుగ సీజన్‌ తర్వాత రిటైల్‌ డిమాండ్‌ తగ్గడం వల్ల శుక్రవారం దేశీయ బంగారం ధరలపై ఒత్తిడి కొనసాగింది’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News