Homeమెదక్‌Diwali | దీపావళి లక్ష్మీ పూజలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు

Diwali | దీపావళి లక్ష్మీ పూజలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు

సదాశివపేట: సదాశివపేట పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో దీపావళి(Diwali) పర్వదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు లక్ష్మీ పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పురోహితులు మడుపతి మహేష్ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ.. ముందుగా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటామని పేర్కొన్నారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో రాగం అనిల్, తాలెల్మ రాము, గుణాకర్, రియాజ్, రాజు, శ్రీనివాస్, సోమశంకర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News