Homeఫోటోలు‘Scene’ | మూవీ యాక్షన్ కామెడీ థ్రిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

‘Scene’ | మూవీ యాక్షన్ కామెడీ థ్రిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

హీరో సూర్య, మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్‌తో కలసి యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘సీన్’(Scene) చేస్తున్నారు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతిక, సూర్య జాగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, గ్లింప్స్ సినిమాలోని క్విర్కీ, ఎంటర్‌టైనింగ్ ప్రపంచాన్ని పరిచయం చేయగా, తొలి రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -

తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. డీఎస్పీ ప్రేమ్‌రాజ్ పాత్రలో సూర్య ఎంట్రీ అదిరిపోయింది. ట్రైలర్‌లో ఆయన కనిపించిన తీరు, తన పాత్రను తీర్చిదిద్దిన విధానం క్యూరియాసిటీని పెంచింది.

‘‘కెరీర్ పరంగా ఇప్పుడు పీక్‌లో ఉన్నప్పుడు ఉద్యోగానికి రిజైన్ చేసి ఏం చేస్తావు?’’ అని ప్రశ్నించగా.. ‘‘పాలిటిక్స్‌లోకి వెళ్లిపోతా’’ అని సూర్య బదులివ్వడం ఆసక్తి రేకెత్తించింది.

ఈశ్వరన్‌గా కనిపించిన నస్లేన్ పాత్ర మరింత ఆసక్తికరంగా ఉంది. తనని పట్టుకునేందుకు డీఎస్పీ ప్రేమ్‌రాజ్ చేసిన సాహసాలు, ఈ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. అలాగే, పని మనిషి పాత్రలో నజ్రియా నజీమ్ పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా వెరైటీగా ఉంది.

వినీత్ అగస్టిన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సుశిన్ శ్యామ్ సంగీతం యాక్షన్, ఎమోషన్‌ను మరింత ఎలివేట్ చేసింది. ఈ చిత్రానికి అజ్మల్ సాబు ఎడిటింగ్, అశ్విని కాలే ప్రొడక్షన్ డిజైన్ అందించారు.

యాక్షన్, కామెడీ, థ్రిల్ అంశాలతో ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది.

Suriya Scene Movie Trailer Released020

ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎన్వీఆర్ సినిమా ద్వారా గ్రాండ్ రిలీజ్ కానుంది.

‘సీన్’(Scene) చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 నవంబర్ 6న దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

Suriya Scene Movie Trailer Released001
- Advertisement -
RELATED ARTICLES

Latest News