HomeఫోటోలుLaunch | చంద్రబోస్ క్లాప్ తో నూతన చిత్రం ప్రారంభం

Launch | చంద్రబోస్ క్లాప్ తో నూతన చిత్రం ప్రారంభం

సకల సమృద్ధిఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది.(Launch) హీరో రాజీవ్ వర్మ, హీరోయిన్ మలైకా టి. వాసుపాల్ జంటగా నటిస్తున్నారు. ఈ జంటపై క్లాప్ చంద్రబోస్ కొట్టారు. ప్రొడ్యూసర్ కనుమూరి ప్రసాద్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, చిత్ర దర్శకుడు గౌతమ్ ప్రసాద్ యల్లపు ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.

ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రంతో గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేను సైతం గౌతమ్ ప్రసాద్ యల్లపు అందిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, కుమనన్ అలియాస్ రమణ, జెమిని సురేష్, రమణ భార్గవ్, శివాజీ రాజా, ఆయూషి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కనుమూరి ప్రసాద్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.

- Advertisement -

ఆర్‌కే సేనాపతి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 12వ తేది నుంచి తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని నాలుగు షెడ్యూల్స్‌లో ముగించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన షెడ్యూల్స్  కోనసీమ పరిసర ప్రాంతంలో జరుగనున్నాయి. ఇది ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్‌లో జరిగే ప్రేమ కథ చిత్రం, కుటుంబం  మొత్తం ఈ చిత్రాన్ని చూసి హాయిగా ఎంజాయ్ చేసే విధంగా దర్శకుడు చిత్రీకరిస్తున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

టెక్నీషియన్స్

ప్రొడ్యూసర్ – కనుమూరి ప్రసాద్ రాజు
కథ – స్క్రీన్‌ప్లే – దర్శకత్వం: గౌతమ్ ప్రసాద్ యల్లపు
ఆర్ట్ డైరెక్టర్ – విఠల్ కోసనం
మ్యూజిక్ – అనూప్ రూబెన్స్
ఎడిటర్ – జే.పి
కో-డైరెక్టర్ – శ్రీనివాస్ రాయి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- యర్రంశెట్టి దుర్గాప్రసాద్
కాస్ట్యూమ్స్ – చంద్రబోస్
పీఆర్ఓ – దుద్ది శ్రీను

- Advertisement -
RELATED ARTICLES

Latest News