Homeసినిమా"Yadbhavam Tadbhavati" | చిత్రం నుండి 'జినక్ చిక' పాట విడుదల

“Yadbhavam Tadbhavati” | చిత్రం నుండి ‘జినక్ చిక’ పాట విడుదల

రమేష్ జక్కల దర్శకత్వంలో ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి నిర్మాతగా ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం యద్భావం తద్భవతి.(Yadbhavam Tadbhavati) వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇనయ సుల్తానా, రేణు శ్రీ హీరోయిన్స్ గా నటిస్తుండగా సుమన్, నాగ మహేష్, లోహిత్ కుమార్, ధనరాజ్, శ్వేత వర్మ, దయానంద్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

శ్యామ్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి మిహిరామ్ సంగీతం అందించగా ఈ చిత్ర పాటలను కే మ్యూజిక్ ద్వారా చిత్ర దండం విడుదల చేస్తుంది. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం నుండి ‘జినక్ చిక’ అంటూ సాగే పాటను ప్రముఖ సింగర్ ఎం.ఎం. శ్రీలేఖ గారి చేతుల మీదగా విడుదల చేయడం జరిగింది. బట్టు విజయ్ కుమార్ రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడగా జేడీ మాస్టర్ కొడుకు చేసారు. 

- Advertisement -
Jinaka Chika Song from Yadbhavam Tadbhavati2

ఈ సందర్భంగా సింగర్ ఎం.ఎం. శ్రీలేఖ గారు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈరోజు నేను “యద్భావం తద్భవతి”((Yadbhavam Tadbhavati)) చిత్రం నుండి ‘జినక్ చిక’ పాటను విడుదల చేయడం జరిగింది. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాట పెప్పిగా, మాస్ వెబ్ తో పండగలకు పెళ్ళిలలో, ఫంక్షన్స్ లో అలాగే కాలేజ్ ఫంక్షన్స్ లో ఎంజాయ్ చేసే విధంగా చాలా బావుంది. రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాటలు హై ఓల్టేజ్ లో ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే, ఈ పాట కూడా అలాగే ఉంది.

మోస్ట్ ఎనర్జిటిక్ హీరో వరుణ్ సందేశ్ నటిస్తున్న ఈ చిత్రానికి రమేష్ జక్కల దర్శకత్వం వహిస్తుండగా ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి నిర్మిస్తున్నారు. వారికి, అలాగే ఈ చిత్ర బృందం అందరికీ ఈ సినిమా ద్వారా మంచి విజయం వచ్చి నిర్మాతకు కాసుల వర్షం కురవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా నుండి రానున్న అన్ని పాటలు ఇలాగే అద్భుతంగా ఉంటాయని ఆశిస్తున్నాను. త్వరలో ఈ చిత్రం థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రేక్షకులంతా ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)

నటీనటులు : వరుణ్ సందేశ్, ఇనయ సుల్తానా, రేణు శ్రీ, సుమన్, నాగ మహేష్, లోహిత్ కుమార్, ధనరాజ్, శ్వేత వర్మ, దయానంద్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు. 

సాంకేతిక బృందం : 

బ్యానర్ : ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్ 
దర్శకత్వం : రమేష్ జక్కల 
నిర్మాత : ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి 
సినిమాటోగ్రఫీ : శ్యామ్ 
సంగీతం : మిహిరామ్ 
మ్యూజిక్ పార్ట్నర్ : కే మ్యూజిక్ తెలుగు 
పిఆర్ఓ : మధు విఆర్

- Advertisement -
RELATED ARTICLES

Latest News