Homeసినిమా‘CULT’ | ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని చేసిన సినిమా

‘CULT’ | ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని చేసిన సినిమా

  • మాస్ కా దాస్ విశ్వక్ సేన్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్ట్’తో(CULT) ప్రేక్షకులను టెర్రిఫిక్ వరల్డ్ లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం విశ్వక్ సేన్  కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తూ, ప్రధాన పాత్రలోనూ నటిస్తున్నారు. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కకరాల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని, వాస్తవ జీవితంలోని కలవరపరిచే ఘటనల స్ఫూర్తితో రూపొందించిన ఇండియాలోనే తొలి ఒరిజినల్ స్లాషర్ థ్రిల్లర్‌. సినిమా విడుదలకు ఒక రోజు ముందు మేకర్స్ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

మొదటి ట్రైలర్‌లో సినిమా నేపథ్యాన్ని పరిచయం చేస్తూ, ఓ పార్టీలో జరిగే స్లాషర్ ఘటనలను చూపించారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో ప్రధానంగా విశ్వక్ సేన్ పోషించిన డీఎస్పీ సంకల్ప్ నాయక్ పాత్రను హైలైట్ చేశారు. గోవాలో స్థానికులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారిని, ముఖ్యంగా తెలుగు వారిని ఇబ్బంది పెట్టడాన్ని సంకల్ప్ సహించడు. వారిని రక్షించాలనే ఉద్దేశంతో గోవాకు బదిలీపై వెళ్తాడు. అయితే, ట్రైలర్ చివరి భాగంలో ఓ పార్టీలో అతను సాగించే హత్యాకాండకు సంబంధించిన విజువల్స్‌ను చూపించి ఆసక్తిని పెంచారు.

- Advertisement -

ఈ రిలీజ్ ట్రైలర్ యాక్షన్, స్లాషర్ ఎలిమెంట్స్‌తో అదిరిపోయింది. విశ్వక్ సేన్ పాత్రను కనికరం లేని వ్యక్తిగా చూపించారు. ఈ పాత్రకు అవసరమైన   పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌ ను విశ్వక్ అద్భుతంగా పలికించారు.

స్లాషర్ ఎలిమెంట్స్‌ను కూడా ఈ సినిమాలో విభిన్నమైన శైలిలో చూపించడం విశేషం.  స్టైలిష్‌గా, దాదాపు కార్టూన్ తరహా విజువల్ ట్రీట్‌మెంట్‌తో వాటిని తెరకెక్కించారు. మురళీ శర్మ రాజకీయ నాయకుడిగా నటించగా, శ్రీకాంత్ అయ్యంగార్ సీనియర్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప ఇతర కీలక పాత్రల్లో నటించారు.

దర్శకుడిగా విశ్వక్ సేన్ సంప్రదాయ కథనాలకు భిన్నంగా, సాహసోపేతమైన కథాంశాన్ని ఎంచుకున్నారు. ట్రైలర్ షార్ప్‌గా, క్రిస్ప్‌గా, ఆసక్తికరంగా సాగుతూ సినిమాలోని విభిన్నమైన కథనం, ఇంటెన్స్సిటీ  కూడిన ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది.

ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందించగా, అరవింద్ ములే ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహించారు. సినిమాటోగ్రాఫర్ అరవింద్ విశ్వనాథన్ తన అద్భుతమైన విజువల్స్‌తో సినిమాలోని  థ్రిల్ ని ప్రజెంట్ చేశారు. రవి బస్రూర్ అందించిన ఎలక్ట్రిఫైయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌ను మరింత ఎలివేట్ చేస్తోంది. రవి తేజ గిరిజాల ఎడిటింగ్  సాంకేతిక విభాగాలన్నీ కలిసి ట్రైలర్ ఇంపాక్ట్‌ను మరింత పెంచాయి.

‘కల్ట్’(CULT) ఓ విభిన్నమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. ప్రాణాల కోసం పోరాడాల్సిన ఉత్కంఠభరితమైన గేమ్, ముందుండి పోరాడే క్రూరమైన పోలీస్ అధికారి, తీవ్రతతో కూడిన విజువల్ ప్రజెంటేషన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. వైలెన్స్, అనూహ్య మలుపులతో సాగే థ్రిల్లర్‌గా రిలీజ్ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ‘కల్ట్’ రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, జపనీస్, స్పానిష్ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ‘కల్ట్’ సినిమా రేపు రిలీజ్ అవుతుంది. రిలీజ్ ట్రైలర్ చూశారు. సెకండాఫ్‌లో ఒక 45 నిమిషాలు అడ్రినలిన్ హై ఇస్తుంది. ఒక సమయంలో ఇది డ్రీమ్‌లా పేపర్ మీదే ఉండిపోతుందేమో అనుకున్నాను.  ప్రొడ్యూస్ చేసిన తారక్ సినిమాస్‌కు థాంక్యూ. ఇది ప్రొడ్యూస్ చేయడానికి చాలా క్రేజీ సినిమా. నేను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను తీశాను. చాలా హై క్వాలిటీ ప్రొడక్ట్‌ను డెలివరీ చేయడానికి ప్రయత్నించాను. ప్రేక్షకులకు చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని చేసిన సినిమా ఇది.

ఈ సినిమా కోసం చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చేశాను. ఒక చిన్న రిక్వెస్ట్. ఈ సినిమా ఆడుతున్న థియేటర్లలో కొంచెం సౌండ్ పెంచమని అడగండి. సున్నిత మనస్కులు, చిన్నపిల్లలు ఈ సినిమాకు కొంచెం దూరంగా ఉండాలని కోరుతున్నాను. ఎందుకంటే చాలా వైల్డ్ సినిమా ఇది. ఈ సినిమా 49 శాతం క్రెడిట్ నేను తీసుకుంటాను. 51 శాతం క్రెడిట్ రవి బస్రూర్ గారికి ఇస్తాను. ఈజీ, కార్తికేయ, అనిరుధ్ చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. వారి క్యారెక్టర్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అలాగే గాయత్రి కూడా చాలా సపోర్ట్ చేసింది. ఆమె క్యారెక్టర్ కూడా ఆడియన్స్‌కు చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. తారక్ మ్యాడ్‌నెస్ ఉండే క్యారెక్టర్  చేశాడు. నా టెక్నికల్ టీమ్ అందరికీ థాంక్యూ. ఈ సినిమా కోసం నా టీమ్ అందరూ ఎంతో కష్టపడ్డారు. ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మరోసారి కోరుతున్నా..థియేటర్‌లో ఈ సినిమాను 6.5 సౌండ్ లో చూడమని కోరుతున్నాను”

యాక్టర్ కార్తికేయ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. నేను ‘కల్ట్’లో(CULT) రమ్మీ క్యారెక్టర్ చేశాను. తను ఫ్రెండ్స్ కోసం ఎంత దూరమైనా వెళ్లే క్యారెక్టర్. మీరందరూ ఈ పాత్రకు కనెక్ట్ అవుతారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన విశ్వక్ గారికి థాంక్యూ. రవి బస్రూర్ గారు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. విశ్వక్ గారికి సినిమా అంటే చాలా ఫ్యాషన్. ఎప్పుడూ సినిమా గురించే మాట్లాడతారు. ఆయనతో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు మా ఫ్యాషన్ కూడా ఇంకా పెరిగింది. ఆయన నటీనటులను చాలా గౌరవిస్తారు. ప్రతి ఒక్కరికీ ఎంతో ఓర్పుతో ఒక సీన్ గురించి వివరిస్తుంటారు. ఈ సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది. ప్రతి ఒక్కరూ థియేటర్‌కు వెళ్లి ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది”  

తారక్ పొన్నప్ప మాట్లాడుతూ.. “కచ్చితంగా ఈ సినిమాను మీరు ఎంజాయ్ చేస్తారు. ప్రతి క్యారెక్టర్‌ను చాలా యూనిక్‌గా డిజైన్ చేశారు. ఇది నెక్స్ట్ లెవల్ సినిమా. ప్రతి ఒక్కరూ తమ క్యారెక్టర్‌ను అర్థం చేసుకుని అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. మా టెక్నికల్ టీమ్‌కు, నటీనటులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. విశ్వక్ నుంచి నేను చాలా ఇన్‌స్పిరేషన్ పొందాను. ఆయన నుంచి మరిన్ని మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. అక్టోబర్ 30న సినిమా విడుదలవుతోంది. అందరూ థియేటర్లకు వచ్చి చూడండి. మీకు ఎలా అనిపించిందో ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ఎందుకంటే వర్డ్ ఆఫ్ మౌత్ చాలా ఇంపార్టెంట్”

యజ్ఞ తుర్లపాటి మాట్లాడుతూ.. “ముందుగా విశ్వక్ గారికి థాంక్యూ. ఈ సినిమాలో పనిచేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. సినిమా షూటింగ్ అంతా ఒక పార్టీలా సాగిపోయింది. టీమ్‌తో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది. మా టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది” అన్నారు.

అనిరుధ్ మాట్లాడుతూ.. “ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇందులోని అన్ని క్యారెక్టర్లకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మా రవి బస్రూర్ గారు నెక్స్ట్ లెవల్ మ్యూజిక్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా మీకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది”(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

నటీనటులు: విశ్వక్ సేన్, గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్, ఈజీ, యజ్ఞ తుర్లపాటి, కబీర్ భారతీయ, విశాక్ నాయర్, చెపురి వివేక్

సాంకేతిక బృందం

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విశ్వక్ సేన్
నిర్మాత: సందీప్ కకరాల
బ్యానర్: తారక్ సినిమాస్
సంగీతం: రవి బస్రూర్
డైలాగ్స్: తరుణ్ భాస్కర్
సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ ములే
ఎడిటర్: రవి తేజ గిరిజాల
కాస్ట్యూమ్ డిజైనర్: జి. అన్నపూర్ణ
స్టంట్స్: కరుణాకర్, జాషువా
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హ్యాష్‌ట్యాగ్ మీడియా

- Advertisement -
RELATED ARTICLES

Latest News