మెగాస్టార్ అంటేనే వైవిధ్యానికి మరో పేరు. దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో వెండితెరపై కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ అరంగేట్రంతో మరో ఆసక్తికరమైన ప్రయాణానికి సిద్ధమయ్యారు. ‘మెగావర్స్’(MegaVerse) పేరుతో రూపొందుతున్న ఈ షో ద్వారా ఆయన డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు.
గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌పై ప్రసారం కానున్న ఈ ప్రత్యేకమైన టాక్ షోలో చిరంజీవి తనదైన చరిష్మా, హాస్యం, విభిన్నమైన ఆలోచనా విధానంతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఆసక్తికరమైన సంభాషణలు, అద్భుతమైన కథలు, ఎన్నో కొత్త విషయాల ఆవిష్కరణతో ఈ షో సాగనుంది.
‘మెగావర్స్’లో(MegaVerse) ప్రేక్షకులతో తరతరాలుగా ప్రత్యేకమైన అనుబంధాన్ని కొనసాగిస్తున్న చిరంజీవి.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, విభిన్న తరాలకు చెందిన స్టార్స్‌తో ముచ్చటించనున్నారు. తన సహజమైన ఆత్మీయత, సందర్భానికి తగ్గట్టుగా స్పందించే ప్రత్యేకమైన శైలి, ఆకట్టుకునే వ్యక్తిత్వంతో ఈ వేదికపై సందడి చేయనున్నారు.
భారతీయ సినిమా గొప్ప లెగసీని సెలబ్రేట్ చేస్తూ, ‘మెగావర్స్’ ద్వారా ప్రేక్షకులు అభిమానించే దిగ్గజాల జీవితాలు, వారి ప్రయాణంలోని ఆసక్తికరమైన విషయాలను మరింత సన్నిహితంగా పరిచయం చేయనుంది. ఈ షోకు మెగాస్టార్ చిరంజీవి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్, SOL ప్రొడక్షన్ LLP సంయుక్తంగా ఈ షోను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ‘మెగావర్స్’ షూటింగ్ జరుగుతోంది. ఈ షోకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
