HomeసినిమాMailu Rayi | నాగబాబు చేతుల మీదుగా ‘మైలురాయి’ సినిమా టైటిల్ లాంచ్

Mailu Rayi | నాగబాబు చేతుల మీదుగా ‘మైలురాయి’ సినిమా టైటిల్ లాంచ్

హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 1గా శ్రీ హన్సిక పెద్దిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘మైలురాయి’.(Mailu Rayi)  తవిటిరాజు తలచింతల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ రఘువర్ధన్ కోట్ల దర్శకత్వం వహిస్తున్నారు. యువ నటీనటులు జగన్ యోగిరాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు సీనియర్ నటుడు దేవీ ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర టైటిల్ లాంచ్ పోస్టర్‌ను సీనియర్ నటుడు, నిర్మాత, ఏపీ శాసనమండలి సభ్యుడు, ఏపీ గ్రీన్ ఛైర్మన్ శ్రీ నాగబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా టైటిల్ ‘మైలురాయి’(Mailu Rayi) చాలా ఆసక్తికరంగా ఉంది. నిర్మాత హన్సిక మంచి సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఔత్సాహిక దర్శకుడు, యువ హీరోతో ఈ చిత్రాన్ని రూపొందించడం అభినందనీయం. ఫిల్మ్ మేకింగ్‌లో మహిళలకు ఉండే బాధ్యత, క్రమశిక్షణ ఎంతో గొప్పవి. ఇప్పటికే అశ్వనీదత్ గారి కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్, నా కుమార్తె నిహారిక, సుప్రియ యార్లగడ్డ వంటి వారు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. హన్సిక కూడా వారి బాటలోనే పయనిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ఈ చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు’’ అని అన్నారు.

- Advertisement -

నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 1గా రూపొందుతున్న ‘మైలురాయి’ టైటిల్ లాంచ్ పోస్టర్‌ను నాగబాబు గారి చేతుల మీదుగా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్, పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు.

సహ నిర్మాత తవిటిరాజు తలచింతల మాట్లాడుతూ.. ‘మైలురాయి’ చిత్రాన్ని లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్నామని తెలిపారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన నాగబాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

హీరో జగన్ యోగిరాజు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో హీరోగా నటించడం చాలా సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ పూర్తయింది. నాగబాబు గారు విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే టీజర్, పాటలు, ట్రైలర్‌ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది’’ అని అన్నారు.

దర్శకుడు రఘువర్ధన్ కోట్ల మాట్లాడుతూ.. ‘‘హన్సి ప్రొడక్షన్స్ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది. ‘మైలురాయి’ భావోద్వేగాలతో కూడిన ప్రేమకథ. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నాను’’ అని తెలిపారు(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

నటీనటులు : జగన్ యోగిరాజు, నవ్య చిట్యాల, దేవీ ప్రసాద్, లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్.

బ్యానర్ : హన్సి ప్రొడక్షన్స్
సమర్పణ :  డా. శ్రీధర్ పెద్దిరెడ్డి
నిర్మాత :  శ్రీ హన్సిక పెద్దిరెడ్డి
సహ నిర్మాత :  తవిటిరాజు తలచింతల
రచన, దర్శకత్వం :  రఘువర్ధన్ కోట్ల
సినిమాటోగ్రాఫర్ :  సాయి వంశీ దాచపల్లి
ఎడిటర్ :  ఉదయకిరణ్ ఏవీ
సంగీత దర్శకుడు :  రాజీవ్ రాజ్
ఆర్ట్ డైరెక్టర్ :  శ్రీపాల్ మాచర్ల
లిరిసిస్టులు :  నాగేంద్ర గోపు, మనోజ్ జులోరి
పీఆర్వో :  GK Media (గణేష్, కుమార్)

- Advertisement -
RELATED ARTICLES

Latest News