Homeహైదరాబాద్‌ACB Arrest | బంజారాహిల్స్ ఎస్ఐ విజయ్‌పై ఏసీబీ కేసు నమోదు.. అరెస్ట్

ACB Arrest | బంజారాహిల్స్ ఎస్ఐ విజయ్‌పై ఏసీబీ కేసు నమోదు.. అరెస్ట్

హైదరాబాద్: ఫార్చ్యూన్ 99 హోమ్స్ అధినేత రోసిరెడ్డి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ సబ్-ఇన్‌స్పెక్టర్ విజయ్‌పై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. ప్లాట్ల విక్రయాలకు సంబంధించిన మోసం కేసులో రోసిరెడ్డిపై విచారణ జరుగుతుండగా, ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగింది?

- Advertisement -

లంచం డిమాండ్ : చీటింగ్ కేసులో అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఎస్ఐ విజయ్ రూ. 10 లక్షలు డిమాండ్ చేసినట్లు రోసిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

రూ. 10 వేలు ఇస్తానంటే రిమాండ్‌కు తరలింపు :

తనవల్ల కేవలం రూ. 10,000 మాత్రమే ఇవ్వగలనని బాధితుడు చెప్పడంతో, కక్షగట్టిన ఎస్ఐ ఆయన్ను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మరో ఆరోపణ :

గతంలో నమోదైన కేసులకు సంబంధించి నోటీసులు ఇస్తామంటూ రోసిరెడ్డిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి, మరో రూ. 1 లక్ష డిమాండ్ చేసినట్లు మరో ఆరోపణ ఉంది.

ఈ వేధింపులతో విసిగిపోయిన బాధితుడు రోసిరెడ్డి నేరుగా ఏసీబీ(ACB) అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రోసిరెడ్డి ఫిర్యాదుపై వెంటనే స్పందించిన ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టి, ఆరోపణలు రుజువు కావడంతో ఎస్ఐ విజయ్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. పోలీసు శాఖలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News