- ఎల్‌నినో ప్రభావం.. కరువు పరిస్థితుల నేపథ్యంలో ఆడంబరాలకు దూరం
- సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న కరువు పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన జన్మదిన వేడుకలను(Ponguleti Birthday Celebrations) నిరాడంబరంగా జరుపుకున్నారు. ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఆడంబరాలకు తావివ్వకుండా పుట్టినరోజును సాధారణంగా గడపాలని నిర్ణయించుకున్నారు.

ఈ సందర్భంగా బుధవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని (CM Revanth Reddy)మంత్రి పొంగులేటి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. మంత్రి వాకిటి శ్రీహరి సైతం పొంగులేటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తన పుట్టినరోజు సందర్భంగా ఎక్కడా ఆర్భాటాలు, వేడుకలు నిర్వహించవద్దని, అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలని మంత్రి ముందుగానే విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంయమనం పాటించాలని సూచించడంతో పాటు, తాను కూడా నిరాడంబరంగా జన్మదినాన్ని జరుపుకోవడం ద్వారా తన నిర్ణయాన్ని ఆచరణలో చూపించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
