- ఓయూలో ‘నషా ముక్త్ భారత్’ అవగాహన కార్యక్రమం
హైదరాబాద్: మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులు, యువతలో అవగాహన కల్పించి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చైతన్యపరచడమే లక్ష్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ‘నషా ముక్త్ భారత్’(Nasha Mukt Bharat) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారానికి సంబంధించిన పోస్టర్లను గవర్నర్ ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు, యువతతో తెలుగులో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను యువతకు వివరించి, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
