- సూపర్ స్టార్ రజనీకాంత్
తన అమృత గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన సంగీత సామ్రాజ్ఞి, గాయని భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత చరిత్రను “భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి”(Bharat Ratna M S Subbulakshmi) సినిమాగా నిర్మిస్తున్నారు విజనరీ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్. ఈ ప్రెస్టీజియస్ మూవీలో ఎంఎస్ సుబ్బులక్ష్మిగా నేషనల్ క్రష్ రశ్మిక మందన్న నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ సెప్టెంబర్ లో లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ చేతుల మీదుగా “భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి” సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. తాజాగా ఈ సినిమాకు మరో లెజెండ్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆశీస్సులు లభించాయి. “భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి” సినిమా తెరకెక్కడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ సినిమా మరో శంకరాభరణం అవుతుందని రజనీకాంత్ రీసెంట్ గా జరిగిన జైలర్ 2 సినిమా ఈవెంట్ లో చెప్పారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించడంపై ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాను స్క్రీన్ మీద చూసేందుకు తాను వేచి చూస్తున్నట్లు రజనీకాంత్ తెలిపారు.
తమ సినిమాకు ఆశీస్సులు అందించిన సూపర్ స్టార్ రజనీకాంత్ కు “భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి” సినిమా టీమ్ కృతజ్ఞతలు తెలిపింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
నటీనటులు – రశ్మిక మందన్న, తదితరులు
టెక్నికల్ టీమ్
——————–
మ్యూజిక్ – అనిరుధ్ రవిచందర్
ప్రొడ్యూసర్స్ – అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీవాస్
డైరెక్టర్ – గౌతమ్ తిన్ననూరి
