Homeరంగారెడ్డిBJR Nagar | బీజేఆర్ నగర్ ప్రధాన రహదారి పక్కనే భారీ నిర్మాణం

BJR Nagar | బీజేఆర్ నగర్ ప్రధాన రహదారి పక్కనే భారీ నిర్మాణం

  • అధికార పార్టీ అండదండలు ఉన్నాయనే అనుమానాలు.. మౌనం వీడని అధికారులు?

జవహర్‌నగర్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జవహర్‌నగర్ బీజేఆర్ నగర్(BJR Nagar) ప్రధాన రహదారిని ఆనుకొని భారీ ఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయా? అనే అంశాలపై అధికారులు వెంటనే విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

పేదవాడు గుడిసె వేసుకుంటేనే హడావుడిగా రంగంలోకి దిగి కూల్చివేతలు చేపట్టే అధికారులు, ప్రధాన రహదారి పక్కనే ఇంత పెద్ద నిర్మాణం జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ప్రజలకు ఒక నిబంధన, పెద్ద నిర్మాణాల విషయంలో మరో నిబంధనా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

- Advertisement -

ఈ నిర్మాణం వెనుక అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయనే అనుమానాలను కొందరు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారిక నిర్ధారణ కావాల్సి ఉంది. నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, స్థల స్వరూపం, భవన నిబంధనల అమలుపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ఇప్పటికైనా జవహర్‌నగర్ మున్సిపల్ అధికారులు, పట్టణ ప్రణాళిక విభాగం స్పందించి నిర్మాణ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. అనుమతులు లేకుండా నిర్మాణం జరుగుతున్నట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. విచారణ వివరాలను ప్రజలకు వెల్లడించి, ప్రభుత్వ నిబంధనలు అందరికీ సమానంగా వర్తిస్తాయని నిరూపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రధాన రహదారి పక్కనే జరుగుతున్న ఈ నిర్మాణంపై అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా? లేక ప్రజల ప్రశ్నలను పట్టించుకోకుండా మౌనం కొనసాగిస్తారా? అన్నది వేచి చూడాల్సి ఉంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News