పక్కదారి పడుతున్న ప్రతిష్టాత్మక పథకం
- డీడీయూజీకేవైలో పీఐఏల(DDU-GKY PIA) ఎంపికపై తీవ్ర విమర్శలు..
- సమగ్ర పరిశీలన చేయాలని విజ్ఞప్తి..
- అర్హత నిబంధలు గాలికి వదిలేసిన వైనం..
- పీ.ఐ.ఏ.ల ఎంపిక, లక్ష్యాల కేటాయింపుపై విచారణకు డిమాండ్
- లంచాల మత్తులో ఎన్.ఐ.ఆర్.డీ. తనిఖీ అధికారులు?
- నిబంధనలను వుల్లంఘిస్తూ పీఐఏల ఎంపిక..
- ఈజీఎంఎం – ఎన్.ఐ.ఆర్.డీ. కార్యాలయాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగులు..
- ఎన్.ఐ.ఆర్.డీ., ఈజీఎంఎం ఉద్యోగులు సిండికేట్ గా మారి ఏజెన్సీల వద్ద వసూళ్లు..
- పలువురు వ్యక్తులు బినామీ పేర్లతో సంస్థల నిర్వహణ..
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్స్..
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన పథకంలో ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీల ఎంపిక ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా సాగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు అర్హతలను పరిశీలించకుండానే పీఐఏ లకు లక్ష్యాలను కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దురదృష్టం ఏమిటంటే తనిఖీ చేయాల్సిన నేషనల్ ఇన్స్ట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అధికారులు లంచాల మత్తులో జోగుతూ..
ఏజెన్సీలకు సంబంధించిన కార్యాలయాలు, వాటికి సంబంధించిన వారి దగ్గర లంచాలు తీసుకుని ఎలాంటి సరైన పత్రాలు లేకున్నా గానీ ఆ ఏజెన్సీలకు అనుగుణంగా పత్రాలను సమకూర్చి ఎంపిక చేస్తున్నారు.. నిబంధనలను, ఉల్లంఘనలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. పీఐఏల ఎంపిక నుంచి చివరికి ప్రాజెక్టుల కేటాయింపు వరకు జరిగిన ప్రతి దశపై సమగ్ర, స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి..
గ్రామీణ నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి, వారి భవిష్యత్తుకు భరోసానివ్వాల్సిన ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన’ పథకం అమలులో తీవ్ర వివాదాలు చెలరేగాయి. తెలంగాణలో ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీల ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో వర్గాలు, నిపుణుల నుంచి సమగ్ర విచారణకు డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

పలువురు వ్యక్తులకు బినామీ సంస్థలకు ఏజెన్సీలు :
ఒకే వ్యక్తి పలు సంస్థలలో ఉంటూ వేర్వేరు సంస్థల పేర్లతో దరఖాస్తులు చేసుకున్నారా ..? నిబంధనలకు విరుద్ధంగా బినామీ సంస్థలను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉన్నతాశయాన్ని, అదేవిధంగా డీడీయూ జీకేవై పథకం యొక్క పారదర్శకతను దెబ్బతీస్తున్నారు.. కేవలం అక్రమ సంపాదన కోసమే ప్రాకులాడుతున్నారని తెలుస్తోంది..
లక్ష్యాల కేటాయింపులో పక్షపాతం :
అర్హతలను పక్కనపెట్టి, కొన్ని నిర్దిష్ట పీఐఏలకే భారీగా శిక్షణా లక్ష్యాలను కట్టబెట్టారన్న విమర్శలపై క్వాలిటీ అప్రైసల్ రిపోర్టులు, పీఏసీ ప్రొసీడింగ్స్‌ను క్షుణ్ణంగా సమీక్షించాలి.
కమీషన్ల రూపంలో వసూళ్లు? :
పీఐఏల ఇనిషియల్ స్క్రీనింగ్, క్వాలిటీ అప్రైసల్ దశల్లో కొందరు సిబ్బంది ఒక్కో సంస్థ నుంచి లక్ష రూపాయల నుండి మూడు లక్షల రూపాయల వరకు లంచాలు డిమాండ్ చేశారనే తీవ్ర ఆరోపణలపై పారదర్శక దర్యాప్తు జరగాలి.. ఎన్.ఐ.ఆర్.డీ. కి తోడుగా కమిషన్ ఏజెంట్లుగా మారిన ఈజీఎంఎం తెలంగాణ ఉద్యోగులు.
లంచాల మత్తులో అధికారులు :
ఈజీఎంఎం ఉద్యోగులు పీ.ఐ.ఏ.ల వద్ద నుండి కమిషన్ మాట్లాడుకొని ఎన్.ఐ.ఆర్.డీ. తనిఖీ అధికారులతో మాట్లాడి ఇనీషియల్ స్క్రీనింగ్, క్వాలిటీ అప్రైసల్ పీ.ఐ.ఏ.కి అనుగుణంగా చేయించి రాష్ట్ర ప్రభుత్వ సంస్థ (ఈజీఎంఎం తెలంగాణ, ఎం.ఓ.ఆర్.డీ, గవర్నమెంట్ అఫ్ తెలంగాణ) కి పంపించుకొని ప్రాజెక్టు కేటాయిస్తున్నారు. ఈజీఎంఎం, ఎన్.ఐ.ఆర్.డీ. లో దశాబ్దాల కాలంగా కాంట్రాక్టు ఉద్యోగులు పాతుకు పోవడంతో అవినీతి పెరిగిపోయింది.. ఈ పథకం యొక్క పారదర్శకత పూర్తిగా నిర్వీర్యం అయిపొయింది.. కావున కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించి శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగులను నియమిస్తే అవినీతి తగ్గి, పారదర్శకత మెరుగుపడుతుందని పలువురు భావిస్తున్నారు..
ఒకే అభ్యర్థిపై రెండు పధకాల నిధులు క్లెయిమ్..:
స్కిల్ డెవలప్మెంట్ రంగంలో అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం ఒకే అభ్యర్థిని ఒకేసారి రెండు వేర్వేరు ప్రభుత్వ పథకాల కింద శిక్షణ పొందుతున్నట్లు నమోదు చేయడం.. ఉదాహరణకు ఒక అభ్యర్ధి డీడీజీకేవై – తెలంగాణ ఎస్సి కార్పొరేషన్ లలో శిక్షణ తీసుకున్నట్లు ప్రధానంగా ఆరోపణలు వున్నాయి.. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి..
ప్రజా నిధుల జవాబుదారీతనం ముఖ్యం :
ప్రభుత్వ నిధులతో అమలయ్యే ఈ పథకంలో ఎంపిక మొదలుకొని.. శిక్షణ, అసెస్మెంట్, సర్టిఫికేషన్, ప్లేస్మెంట్ మరియు ఆ తర్వాత పర్యవేక్షణ వరకు ప్రతీ దశలోనూ అత్యుత్తమ పారదర్శకత ఉండాలి.ఈ విచారణ ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావాలని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలపై ఉన్న అనుమానాలను కూడా అధికారికంగా నివృత్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కేవలం శిక్షణ సంఖ్యలకే పరిమితం కాకుండా, గ్రామీణ యువతకు నిజమైన ఉపాధి, స్థిరమైన జీవనోపాధి లభించినప్పుడే ఈ పథకం లక్ష్యం నెరవేరుతుంది..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
