- ఆయన చిత్రానికి అరుదైన పురస్కారం…
వెంకటాపురం: జాతీయస్థాయిలో వెంకటాపురం వాసి చంద్రకళ తీసిన ఛాయాచిత్రానికి అరుదైన గౌరవం లభించింది. భారతీయ వారసత్వము మరియు దేశభక్తి పురస్కారము చంద్రకళకు దక్కింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా బహుమతి ప్రధానం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా (పై) సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

శ్రీరాముల సదాశివప్రసాద్ (చంద్రకళ) తీసినఛాయాచిత్రం తో వెంకటాపురం పేరు జాతీయస్థాయిలో మారుమోగింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటలలోపు తీసిన చిత్రాలకు మాత్రమే పోటీలో అర్హత కల్పిస్తూ నిర్వాహకులు కఠిన నిబంధనలు విధించారు. దేశవ్యాప్తంగా లక్షలాది ఛాయాచిత్రాలు పోటీపడగా, చంద్రకళ తీసిన చిత్రం విజేతగా నిలిచింది.
వరి పొలంలో రైతులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న అపూర్వ దృశ్యాన్ని చంద్రకళ తన కెమెరాలో బంధించారు. పచ్చని పంట పొలం, రైతు, త్రివర్ణ పతాకం, దేశభక్తి భావనలను ఒకే ఫ్రేమ్‌లో అద్భుతంగా ఆవిష్కరించిన ఈ చిత్రం “జై జవాన్… జై కిసాన్” స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ జాతీయస్థాయిలో(National Photography Award) ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రతిభకు మారుమూల ప్రాంతమా… పట్టణమా అన్న తేడా లేదని చంద్రకళ తన ప్రతిభతో మరోసారి నిరూపించారు. గతంలో రాష్ట్ర స్థాయిలో ఛాయాచిత్రాల పోటీలలో అనేక బహుమతులు ఆయన అందుకోవడం విశేషం.

అక్టోబర్ 2న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో ముఖ్య అతిథి ప్రొఫెసర్ కె. గంగాధరరావు, విశిష్ట అతిథులు దొక్కా మాణిక్య వరప్రసాద్, ఆర్. మల్లికార్జునరావు, అధ్యక్షులు, ప్రొఫెసర్ ఎం. సురేష్ కుమార్, గౌరవ అతిథులు ప్రొఫెసర్ ఆర్. శివరామ ప్రసాద్, ప్రొఫెసర్ జి. సింహాచలం తదితరుల చేతుల మీదుగా చంద్రకళ ఈ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డును అందుకున్న చంద్రకళను స్థానికులు పరువులు అభినందించారు. చంద్రకళ భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకొని ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు తేవాలని ఆకాంక్షించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

