వెంకటాపురం: మండల పరిధిలోని వెంకటాపురం, ఆలుబాక గ్రామాల్లో స్థానిక పిఎసిఎస్( సొసైటీ) ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను(Procurement Centers) శుక్రవారం సీఈవో సత్యనారాయణ ప్రారంభించారు. ప్రస్తుత వర్షాకాల ఖరీఫ్ సీజన్లో రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు మద్దతు ధర పొందాలంటే కేంద్ర ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. బాగా ఆరబెట్టిన చెత్త లేని, రాళ్లు, మట్టి లేకుండా శుభ్రంగా ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)


- Advertisement -
