- సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పిలుపు
- క్యాంపు కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి
- పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే
సంగారెడ్డి: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్(MLA Chinta Prabhakar) స్వయంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, చేతులెత్తి నమస్కరించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో అహింసా మార్గాన్ని ఆయుధంగా మలిచి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. సమాజంలో శాంతి, సత్యం, అహింస, సామాజిక సమానత్వం వంటి ఉన్నత విలువలను పాటిస్తూ, బాపూజీ కలలుగన్న సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. గాంధీజీ చూపిన శాంతియుత మార్గం ఎల్లప్పుడూ అనుసరణీయమని ఆయన స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే చింత ప్రభాకర్(MLA Chinta Prabhakar) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ (CDC) చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, డాక్టర్ శ్రీహరి, సునీల్, మండల పార్టీ అధ్యక్షుడు విఠల్, చీల మల్లన్న, మాజీ జెడ్పీటీసీ (ZPTC) పాండు, కౌన్సిలర్లు దశరథ్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ప్రేమ నందం, మాజీ కౌన్సిలర్ విష్ణు, శ్రవణ్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొని బాపూజీకి ఘన నివాళులర్పించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
