- డాక్టర్ ఎన్. బాల్ రాజ్ గా గుర్తింపు..
- శాసన సభా ప్రత్యేక హక్కులపై పరిశోధనలు పూర్తి..
- బహుముఖ ప్రజ్ఞాశాలిగా బాల రాజ్ గుర్తింపు..
తెలంగాణ బీజేపీ నేత నూనె బాల్ రాజ్(Nune Balraj) న్యాయ శాస్త్రంలో డాక్టరేట్ సాధించారు. గురుగ్రామ్‌లోని కేఆర్ మంగళం యూనివర్సిటీ ఆయన సమర్పించిన పరిశోధనలను ఆమోదిస్తూ, న్యాయ శాస్త్రంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్డీ) పట్టాను బుధవారం అధికారికంగా ప్రకటించింది. యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లీగల్ స్టడీస్ పరిధిలో ఆయన పరిశోధన కొనసాగింది. ఆయన పరిశోధనా అంశం “భారతదేశంలో శాసనసభా ప్రత్యేక హక్కులు – న్యాయవ్యవస్థ స్పందన – ఒక విమర్శనాత్మక అధ్యయనం”. ఈ పరిశోధనకు డాక్టర్ ఆర్తి శర్మ సూపర్వైజర్గా, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ (డాక్టర్) ఎన్. వెంకటేశ్వర్లు కో-సూపర్వైజర్గా వ్యవహరించారు. భారతదేశంలోని శాసనసభా ప్రత్యేక హక్కుల రాజ్యాంగపరమైన పునాది, చారిత్రక పరిణామం, పరిధి, న్యాయవ్యవస్థ స్పందన, సమకాలీన సవాళ్లను ఆయన పరిశోధనలో విమర్శనాత్మకంగా విశ్లేషించారు.

యునైటెడ్ కింగ్డమ్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లో అమలులో ఉన్న శాసనసభా ప్రత్యేక హక్కుల వ్యవస్థలను వివరంగా పరిశీలించారు. డాక్టరల్ వైవా వోస్ ముగింపు సందర్భంగా ఢిల్లీ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ లా ప్రొఫెసర్ (డాక్టర్) వాగేశ్వరి దేశ్వాల్ నిర్దేశిత విద్యా ప్రక్రియ అనంతరం ఆయన డాక్టరల్ డిఫెన్స్ విజయవంతంగా పూర్తయినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనను “డాక్టర్ ఎన్. బాల్ రాజ్”గా ప్రకటించడం జరిగింది అని వెల్లడించారు.
తన తొలి విద్యా మార్గదర్శకురాలైన ప్రొఫెసర్ ఇందర్‌ప్రీత్ కౌర్‌కు బాల్ రాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సూపర్వైజర్ డాక్టర్ ఆర్తి శర్మ, కేఆర్ మంగళం యూనివర్సిటీ, కో-సూపర్వైజర్ ప్రొఫెసర్ (డాక్టర్) ఎన్. వెంకటేశ్వర్లుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేఆర్ మంగళం యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అనిల్ కుమార్ సైనీ, చైర్ ప్రొఫెసర్ డాక్టర్ మెహ్రాజ్ ఉద్దీన్ మీర్, డీన్ డాక్టర్ కావేరి శర్మ, హెడ్ లైబ్రేరియన్ డాక్టర్ హెలాలుద్దీన్తో పాటు అధ్యాపకులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణలో పుట్టి పెరిగిన బాల్ రాజ్ విద్యార్థి దశ నుంచే ప్రజా, సంస్థాగత కార్యక్రమాలతో అనుబంధం ఏర్పరుచుకున్నారు. 1987లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో అనుబంధం ఏర్పరుచుకున్న ఆయన వీ హెచ్ పీ లోనూ పనిచేసారు. అనంతరం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)తో పాటు పలు విద్యార్థి, సామాజిక సంస్థల కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
1996లో భారతీయ జనతా పార్టీలో చేరి సంస్థాగత, ప్రజాసేవా బాధ్యతల్లో కొనసాగారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పట్టాలు పొందిన ఆయన సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు తదితర న్యాయస్థానాలు, ట్రైబ్యునళ్లలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ప్యానెల్ కౌన్సెల్, సీనియర్ ప్యానెల్ కౌన్సెల్‌గా సేవలందించారు. బీజేపీ సంస్థాగత బాధ్యతల్లో భాగంగా తెలంగాణకు సంబంధించిన బాధ్యతలతో పాటు న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో సరల్ కార్యక్రమానికి సంబంధించిన బాధ్యతలు నిర్వహించారు.
సెంట్రల్ బీజేపీ కోఆర్డినేటర్ (తెలంగాణ), సరల్ నేషనల్ ఇన్చార్జ్గా ఆయన నిర్వహించిన బాధ్యతలు రాష్ట్రపతి భవన్ డిజిటల్ లైబ్రరీ సహా పలు ప్రజా రికార్డుల్లో నమోదయ్యాయి. అందరికీ సమాన అవకాశాలు అనే లక్ష్యంతో స్థాపించిన త్రీనేత్ర ఫౌండేషన్ ద్వారా విద్య, పరిశోధన, సామాజిక సేవ, వెనుకబడిన వర్గాలకు అవకాశాల కల్పన వంటి కార్యక్రమాలు చేపట్టారు. విద్యాదానం, విద్యా కార్యక్రమాలు, పరిశోధనా కార్యక్రమాలు, సమాజ ఉపయోగ కార్యక్రమాలకు మద్దతు అందించారు. విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు, విద్యా సదస్సులకు నాలెడ్జ్ పార్ట్నర్గా కూడా ఫౌండేషన్ వ్యవహరించింది. క్రీడా పరిపాలనలోనూ బాధ్యతలు చేపట్టిన బాల్ రాజ్ 2025 అక్టోబర్‌లో 2025–2028 కాలానికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అసోసియేషన్ కొత్త గవర్నింగ్, అపెక్స్ కౌన్సిళ్ల ఏర్పాటులో భాగంగా ఈ నియామకం జరిగింది.
బాల్ రాజ్ (Nune Balraj) బహుముఖ ప్రజా ప్రయాణంలో న్యాయశాస్త్రంలో పీహెచ్డీ సాధన మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. శాసనసభా ప్రత్యేక హక్కులపై ఆయన చేసిన పరిశోధన, న్యాయం, రాజ్యాంగ సంస్థలు, ప్రజా వ్యవహారాలపై ఆయనకున్న అనుభవాన్ని దీర్ఘకాలిక విద్యా అధ్యయనంతో అనుసంధానించింది. ఈ డాక్టరేట్ సాధన కేవలం ఒక విద్యా అర్హత మాత్రమే కాదని, ఎన్నో సంవత్సరాల అధ్యయనం, పరిశోధన, పట్టుదల, మేధోపరమైన కృషి ఫలితంగా ఇది సాధ్యమైందని బాల్ రాజ్ పేర్కొన్నారు.
న్యాయం, రాజ్యాంగ పరిపాలనపై తన అధ్యయనాన్ని మరింతగా కొనసాగించేందుకు ఈ విజయం ప్రేరణనిస్తుందని తెలిపారు. తన ప్రయాణంలో తోడుగా నిలిచిన కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, మార్గదర్శకులు, సహచరులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవృత్తిలో సుప్రీంకోర్టు, హైకోర్టులు, ఇతర న్యాయస్థానాలు, ట్రైబ్యునళ్లలో ప్రాక్టీస్ చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ కౌన్సెల్, సీనియర్ ప్యానెల్ కౌన్సెల్‌గా బాధ్యతలు నిర్వహించారు. త్రీనేత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకుడిగా, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వైస్ చైర్మన్‌గా, సెంట్రల్ బీజేపీ కోఆర్డినేటర్ (తెలంగాణ), సారల్ నేషనల్ ఇన్చార్జ్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)
