Homeనల్లగొండTrain Accident | రైలు ఢీకొని 600 గొర్రెల మృ*తి..

Train Accident | రైలు ఢీకొని 600 గొర్రెల మృ*తి..

  • బాధిత రైతును పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య.

బీబీనగర్ఘ-ట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య కొండమడుగు సమీపంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో కుక్కలు, అడవి పందులు బెదిరించడంతో భయపడిన సుమారు 600 గొర్రెల మంద రైల్వే ట్రాక్‌పైకి రావడంతో, అదే సమయంలో అటుగా వచ్చిన రైలు ఢీకొట్టింది(Train Accident). ఈ ప్రమాదంలో గొర్రెలన్నీ అక్కడికక్కడే మృ*తి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల యజమాని కిష్టయ్యకు దాదాపు రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా తన జీవనాధారమైన గొర్రెలన్నీ మృ*తి చెందడంతో కిష్టయ్య కన్నీరుమున్నీరుగా విలపించారు.

విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును స్థానికులు, బాధిత రైతును అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత రైతు కిష్టయ్యను పరామర్శించి ధైర్యం చెప్పారు. జరిగిన నష్టంపై విచారం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

- Advertisement -

అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ భాస్కర్ రావు తో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ప్రమాద వివరాలను ఆయనకు తెలియజేశారు. ఘటనపై అధికారులు వెంటనే స్పందించి పంచనామా నిర్వహించి, జరిగిన నష్టాన్ని అంచనా వేసి, బాధిత రైతు కిష్టయ్యకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జీవనోపాధిగా పెంచుకుంటున్న వందలాది గొర్రెలను కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News