Homeహైదరాబాద్‌50-Hrs Praja Kala Jathara | 50 ఏళ్ల విప్లవోద్యమం..

50-Hrs Praja Kala Jathara | 50 ఏళ్ల విప్లవోద్యమం..

  • నిరంతరాయంగా సాగుతున్న 50 గంటల ప్రజా కళాజాతర..
  • ప్రజా గాయని విమలక్క సాగిస్తున్న మహా గాన యజ్ఞం..
  • ఆర్టీసీ కళాభవన్ లో రెండోరోజు కొనసాగిన జాతర..

అరుణోదయ సమాఖ్య అధ్యక్షురాలు, ప్రజా గాయని విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతిక(50-Hrs Praja Kala Jathara) ఉద్యమ ప్రస్థానం నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో 50 గంటల ప్రజా కళాజాతర కార్యక్రమం శనివారం అట్టహాసంగా ప్రారంభమైన విషయం విదితమే.. శనివారం రోజు తొలుత అరుదోదయ సమాఖ్య ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కు నుంచి ఆజాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్ వరకు ప్రజా కళాజాతర నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు బోనాలు ఎత్తుకొని కోలాటం ఆడి సందడి చేశారు. డప్పువాయిద్య కళాకారులు డప్పులు కొడుతూ స్టెప్పులు కలుపుతూ ముందుకు సాగారు. కోయ కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు.

అందరూ ఆర్టీసీ కళాభవన్‌కు చేరుకున్న తర్వాత తొలుత సభాప్రాంగణ ఆవరణలో ఏర్పాటు అరుణోదయ సాంస్కృతిక జెండాను అరుణోదయ సీనియర్ కార్యకర్త అంబిక ఆవిష్కరించారు. అనంతరం కళాభవన్‌లో ఏర్పాటు చేసిన విమలక్క 50 సంవత్సవాల విప్లవోద్యమం, తెలంగాణ ఉద్యమం, బహుజన బతుకమ్మ కార్యక్రమాలకు సంబందించిన ఫొటో గ్యాలరీని ఆమె ప్రారంభించారు. అనంతరం ప్రజాకళాజాత సభా కార్యక్రమాన్ని సినీ దర్శకుడు ఉమామహేశ్వర్‌రావు ప్రారంభించారు.

- Advertisement -

పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో ప్రజాసాంస్కృతిక ఉద్యమం వైపు నిలవటం చాలా కష్టమైన పని అని అన్నారు.50 ఏళ్లుగా విమలక్క ప్రజాసాంస్కృతిక ఉద్యమం వైపు నిలవడం గొప్ప విషయమని కొనియాడారు. 50 ఏళ్లుగా జనంలో ఉంటూ వారితో మమేకమయ్యారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, గాయకులూ, కళాకారులు పాల్గొని కార్యక్రమాన్ని ఓలలాడించారు..(https://epaper.aadabhyderabad.in/), (Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News