- జిల్లా ఇన్ ఛార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్.
ప్రజావాణి (Prajavani) దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయకూడదని జిల్లా ఇన్ ఛార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్(Addl Collector Rathod Ramesh)అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో(Prajavani Program) ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వయంగా స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు.



ప్రజావాణి (Prajavani) కార్యక్రమంలో భాగంగా, ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను ఆయనకు సమర్పించారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ రాకేష్, ఆర్డీవో దేవీదాస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)
