- నిమజ్జన ఏర్పాట్లలో భక్తులకు అసౌకర్యం కలగొద్దు
- సమన్వయంతో వేడుకలు విజయవంతం చేయాలని పిలుపు
సంగారెడ్డి పట్టణంలోని ఐబీ వద్ద ప్రతిష్టించిన వినాయక మండపాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వినాయక నిమజ్జనోత్సవ ఏర్పాట్లపై స్థానిక నాయకులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ఆయన సమీక్షించారు.Jagga Reddy
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన వేడుకలను అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని సూచించారు. వేడుకలకు విచ్చేసే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, మౌలిక వసతుల కల్పనలో అధికారులు, ఉత్సవ నిర్వాహకులు పరస్పర సమన్వయంతో ముందుకెళ్లి వేడుకలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండప నిర్వాహకులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- Advertisement -
