- నూతన ఉత్సవ కమిటీ ఎన్నిక.. వరుస క్రమ కరపత్రం ఆవిష్కరణ
- మౌలిక వసతులు కల్పించాలని మున్సిపల్ అధికారులకు వినత
పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవాలను అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సదాశివపేట(Sadashivpet) సామూహిక గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో పాటు, సామూహిక నిమజ్జన ఊరేగింపు సాఫీగా సాగేందుకు రూపొందించిన ‘వరుస క్రమ సంఖ్య’ కరపత్రాన్ని మంగళవారం ఘనంగా విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడిగా రవీంద్రనాథ్ రాందాస్, ముఖ్య సలహాదారుగా మునిపల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా పవన్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. అలాగే కమిటీ సభ్యులుగా డోనూరు పాండురంగారెడ్డి, పి. విష్ణువర్ధన్ రెడ్డి, టి. నాగనాథ్, రాజన్న స్వామి, బరాడి తిరుపతి, గంట శివయ్య, పృథ్వీరాజ్, మహేష్ స్వామి, కె. శంకర్ గౌడ్, వి. మాణిక్ రావు, వి. శ్రీశైలం, ఉల్లిగడ్డల నాగన్న, కన్నాయగరి శంకర్ గౌడ్, బి. అనిల్ కుమార్, చిల్ల మల్లన్న, పిల్లోడి విశ్వనాథ్, నాగరాజు గౌడ్ (జై), శివలింగం, హరిలు బాధ్యతలు స్వీకరించారు.Sadashivpet
మున్సిపాలిటీకి వినతిపత్రం అందజేత:
అనంతరం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కమిషనర్, కౌన్సిల్ సభ్యులను కలిసి లిఖితపూర్వక వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణంలో అక్టోబర్ 23 (బుధవారం), 25 (శుక్రవారం) తేదీల్లో భారీ సామూహిక నిమజ్జన ఊరేగింపులు జరగనున్నాయని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పురపాలక యంత్రాంగం వెంటనే మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
కమిటీ ప్రధాన విజ్ఞప్తులు:
సీసీ రోడ్ల మరమ్మతులు: ఊరేగింపు మార్గమైన వినాయక చౌక్ (గాంధీ చౌక్) వద్ద గుంతలను తక్షణమే సీసీతో పూడ్చివేయాలి.
జనరేటర్లతో నిరంతర విద్యుత్ & సౌండ్: భారీ విగ్రహాల కదలిక వల్ల ప్రధాన విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు కావున, వినాయక చౌక్ నుంచి సిద్ధాపురం గల్లీ, గడి మైసమ్మ ఆలయం, ఎస్ మార్ట్, బచ్చు కిషన్ షాప్ వరకు వీధుల్లో జనరేటర్ల ద్వారా లైటింగ్ ఏర్పాటు చేయాలి; అలాగే సౌండ్ సిస్టమ్ కూడా జనరేటర్లపై నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలి.
తాగునీటి సౌకర్యం: ఊరేగింపులో పాల్గొనే భక్తుల కోసం వినాయక చౌక్ వద్ద వాటర్ ట్యాంకర్లకు బదులుగా పరిశుభ్రమైన వాటర్ బబుల్స్ (క్యాన్లు) అందుబాటులో ఉంచాలి.
మొబైల్ టాయిలెట్లు: మహిళలు, భక్తుల సౌకర్యార్థం వినాయక చౌక్ వద్ద మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలి. భారీ క్రేన్ల ఏర్పాటు: పట్టణంలో విగ్రహాలు అత్యంత భారీగా ఉన్నందున, స్థానిక వినాయక సాగర్ (ఉబ్బ చెరువు)లో నీరు తక్కువగా ఉండడంతో నిమజ్జనం సజావుగా సాగేందుకు అవసరమైన భారీ క్రేన్లను ముందుగానే రప్పించాలి. ఉత్సవాల ప్రాధాన్యతను గుర్తించి మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి, యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని కమిటీ సభ్యులు కోరారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
