Homeనిజామాబాద్‌No DJ Permission | డీజేలకు "నో" పర్మిషన్… అడ్వాన్సులు ఇచ్చి మోసపోవద్దు!

No DJ Permission | డీజేలకు “నో” పర్మిషన్… అడ్వాన్సులు ఇచ్చి మోసపోవద్దు!

  • నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు: తాడ్వాయి ఎస్సై నరేష్.

కామారెడ్డి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వినాయక చవితి ఉత్సవాల్లో డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని(No DJ Permission), ఉత్సవ కమిటీ నిర్వాహకులు తొందరపడి డీజేలకు అడ్వాన్సులు ఇచ్చి నష్టపోవద్దని తాడ్వాయి ఎస్సై నరేష్(Tadwai SI Naresh) ఖరాఖండీగా తేల్చిచెప్పారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. తాడ్వాయి మండలంలోని అన్ని గ్రామాలలోని మండపాల వద్ద గానీ, నిమజ్జన ఊరేగింపులో గానీ ఎలాంటి ఘర్షణలకు దిగినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

మండపాల వద్ద, నిమజ్జన ఊరేగింపులో పరిమిత సౌండ్ బాక్సులకు మాత్రమే అనుమతి ఉందన్నారు. మండపాల వద్ద ఎల్లప్పుడూ యూత్ కమిటీ సభ్యులు అందుబాటులో ఉండి పర్యవేక్షించాలని సూచించారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, అత్యంత భక్తిశ్రద్ధలతో సంతోషంగా నిర్వహించుకోవాలని, పోలీసు శాఖకు సహకరిస్తూ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News