HomeసినిమాI'm Game | దుల్కర్ సల్మాన్ పాడిన ‘ఐయామ్ గేమ్’ మూవీ నుంచి ‘లూజర్’ సాంగ్

I’m Game | దుల్కర్ సల్మాన్ పాడిన ‘ఐయామ్ గేమ్’ మూవీ నుంచి ‘లూజర్’ సాంగ్

దుల్కర్ సల్మాన్ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ నుంచి రెండో సింగిల్ ‘లూజర్’ విడుదలైంది. జేక్స్ బిజోయ్ స్వరపరిచిన ఈ పాటను మలయాళంలో దుల్కర్ సల్మాన్ స్వయంగా ఆలపించారు. సుహైల్ కోయా సాహిత్యం అందించారు. మలయాళ వెర్షన్‌లో కె. బాలసరంగన్, జేక్స్ బిజోయ్ కూడా వోకల్ అందించారు.

ఈ పాటను మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేశారు. తమిళ, తెలుగు వెర్షన్లను బెన్నీ దయాల్ ఆలపించగా, విఘ్నేష్ రామకృష్ణ(తమిళ్), సనారే(తెలుగు) సాహిత్యం అందించారు. హిందీ వెర్షన్‌ను బెన్నీ దయాల్ పాడగా, నుమాన్ ఖోకర్ సాహిత్యం అందించారు. కన్నడ వెర్షన్‌లో సాయి మాధవ్ రెళ్ల వోకల్ అందించగా, హృదయ శివ సాహిత్యం రాశారు. ఈ చిత్రం 2026 సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

- Advertisement -

ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్‌గా విడుదల చేయనుంది.

స్టైలిష్, ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజికల్ స్టైల్‌లో రూపొందిన ‘లూజర్’ సాంగ్ యువతను ఆకట్టుకునేలా ఉంది. ‘ఐయామ్ గేమ్’లోని స్టైలిష్ మూడ్, ఎనర్జీని ఈ పాట కనిపిస్తోంది. సినిమా వైబ్రెంట్ వరల్డ్‌కు సంగీతం ద్వారా ఓ ఆసక్తికరమైన పరిచయాన్ని అందిస్తోంది.

‘ఐయామ్ గేమ్’ ఆడియో లాంచ్, ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 29న సాయంత్రం 6 గంటల నుంచి కక్కనాడలోని కిన్‌ఫ్రా ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనుంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం రికార్డు స్థాయి రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్, తొలి సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మలయాళంతో పాటు తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైన ట్రైలర్ అద్భుతమైన విజువల్స్, హై-ఆక్టేన్ యాక్షన్, థ్రిల్లింగ్ ఛేజ్ సీక్వెన్స్‌లతో పాన్-ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది.  సినీ ప్రేక్షకులు ఇంతకుముందు చూడని సరికొత్త స్టైలిష్ ఫాంటసీ థ్రిల్లర్ అనుభూతిని ఈ సినిమా అందించబోతుంది. ఈ చిత్రానికి జీ మ్యూజిక్ మ్యూజిక్ రైట్స్ సొంతం చేసుకోగా, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.

దక్షిణ భారతదేశంలోని 100కు పైగా లొకేషన్లలో చిత్రీకరించిన ‘ఐయామ్ గేమ్’ దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 40వ చిత్రం. ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దుల్కర్ సల్మాన్‌తో పాటు ఆంటోనీ వర్గీస్, తమిళ నటుడు-దర్శకుడు మిస్కిన్, కాయదు లోహర్, కతిర్, పార్థ్ తివారీ, తమిళ నటి సంయుక్త విశ్వనాథన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మెగా బ్లాక్‌బస్టర్ ‘లోకా చాప్టర్ 1: చంద్ర’ తర్వాత వే ఫేరర్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న  ‘ఐయామ్ గేమ్’. సూపర్‌హిట్ ‘RDX’ తర్వాత దర్శకుడు నహాస్ హిదాయత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

భారీ స్థాయి యాక్షన్, ఫాంటసీ అంశాలు, దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో ‘ఐయామ్ గేమ్’ 2026 సెప్టెంబర్ 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

దర్శకత్వం: నహాస్ హిదాయత్
సినిమాటోగ్రఫీ: జిమ్షీ ఖలీద్,
సంగీతం: జేక్స్ బిజోయ్,
ఎడిటింగ్: చమన్ చాకో
లైన్ ప్రొడ్యూసర్: బిబిన్ పెరుంబిల్లి,
ప్రొడక్షన్ హెడ్స్: సుజోయ్ జేమ్స్, దేవదేవన్,
ప్రొడక్షన్ డిజైనర్: అజయన్ చలిసేరి,
మేకప్: రోనెక్స్ జేవియర్,
కాస్ట్యూమ్: మషార్ హంస,
ప్రొడక్షన్ కంట్రోలర్: దీపక్ పరమేశ్వరన్,
అసోసియేట్ డైరెక్టర్: రోహిత్ చంద్రశేఖర్,
సాహిత్యం: మను మంజిత్, వినాయక్ శశికుమార్,
VFX: తౌఫీక్ (ఎగ్ వైట్),
పోస్టర్ డిజైన్: టెన్ పాయింట్,
సౌండ్ డిజైన్: సింక్ సినిమా,
సౌండ్ మిక్స్: కన్నన్ గణపతి,
స్టిల్స్: SBK,
మార్కెటింగ్ హెడ్: విజిత్ విశ్వనాథన్

- Advertisement -
RELATED ARTICLES

Latest News