HomeసినిమాMohabbat | రాఖీ సందర్భంగా ‘మొహబ్బత్’ మూవీ నుంచి పోస్టర్

Mohabbat | రాఖీ సందర్భంగా ‘మొహబ్బత్’ మూవీ నుంచి పోస్టర్

ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న సరికొత్త పాన్-ఇండియా చిత్రం *‘మొహబ్బత్’. సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి కథ, మాటల్ని కలాం అందిస్తున్నారు. ఈ మూవీకి మ్యాక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా రాఖీ పండుగ స్పెషల్‌గా ఓ సోల్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

రాఖీ పండుగా సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. హీరో హీరోయిన్లను అందంగా చూపిస్తున్న ఈ పోస్టర్.. ఓ బ్యూటీఫుల్ లవ్ స్టోరీని ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నట్టుగా చెబుతోంది. ఎమోషనల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీగా రానున్న ఈ మూవీని తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళీ భాషల్లో విడుదల చేయనున్నారు.

- Advertisement -

ఈ సినిమాకి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తుండగా.. వైఎస్ కృష్ణ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.

తారాగణం : సంతోష్ కల్వచర్ల, శ్రేయాసి సేన్, అజయ్ ఘోష్, సాత్విక్ తదితరులు

సాంకేతిక బృందం:

నిర్మాత: అఫ్రోజ్ షేక్
బ్యానర్: ఏబీఎస్ ప్రొడక్షన్
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: మ్యాక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలీం షేక్
కథ & సంభాషణలు: కలాం
అదనపు స్క్రీన్ ప్లే: కేవీఆర్
సంగీత దర్శకుడు: సునీల్ కశ్యప్
ఛాయాగ్రహణం: వైఎస్ కృష్ణ
సాహిత్యం: భాష్యశ్రీ
కొరియోగ్రాఫర్: మోయిన్
యాక్షన్: జోషువా
డిజైన్స్: ఎంకేఎస్ మనోజ్
ప్రొడక్షన్ మేనేజర్: రాజ శేఖర్

- Advertisement -
RELATED ARTICLES

Latest News