Homeబిజినెస్Sugar Price | పైపైకి ఎగబాకుతున్న చెక్కర ధరలు..

Sugar Price | పైపైకి ఎగబాకుతున్న చెక్కర ధరలు..

  • చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం..
  • భారీ చెక్కెర కుంభకోణం జరిగిందన్న విపక్షాలు..

విపరీతంగా పెరుగుతున్న చక్కెర ధరలు రానున్న పండుగ సీజన్‌లో ప్రజలకు తీపిని దూరం చేయనున్నాయి. పండుగలు సమీపిస్తుండటంతో ప్రజలు స్వీట్లు, ఇతర సాంప్రదాయ వంటకాల కోసం చక్కెరను నిల్వ చేసుకుంటుండంతో దాని డిమాండ్‌ పెరగనున్నది. అయితే ఒకవైపు చక్కెర కోసం అధిక ధరను చెల్లిస్తున్న వినియోగదారులు మరోవైపు ఫాస్ట్‌-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లు, ఆఫ్‌లైన్‌ రిటైలర్లు చక్కెర కొనుగోళ్లపై పరిమితులు విధించడంతో కొరతను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతున్నది.

జెప్టో, బ్లింకిట్‌, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లు కొన్ని చక్కెర ఉత్పత్తులపై పరిమాణ పరిమితులను విధించినట్టు తెలుస్తున్నది. ఉత్పత్తులు, ప్లాట్‌ఫారాలను బట్టి ఈ పరిమితులు మారుతున్నాయి. చక్కెర వినియోగం పెరుగుతుందని భావిస్తున్న తరుణంలోనే దాని ధరలు భారీగా పెరిగి వినియోగదారులు, చిల్లర వ్యాపారులపై ఒత్తిడిని పెంచుతుండటంతో ఈ పరిమితులు విధించినట్టు తెలుస్తున్నది. కొనుగోలుపై ఉన్న ఆంక్షలు భౌతిక రిటైల్‌ రంగానికి కూడా విస్తరించాయి. డిమార్ట్‌, రిలయన్స్‌ వంటి పెద్ద ఆఫ్‌లైన్‌ రిటైల్‌ చైన్‌లకు చెందిన కొన్ని స్టోర్లలో ఒక్కో కస్టమర్‌కు చక్కెర కొనుగోళ్లను సుమారు 2-3 కిలోలకు పరిమితం చేశాయి.

- Advertisement -

ప్రభుత్వ చర్యలు :

చక్కెర ధరల పెరుగుదల నేపథ్యంలో సరఫరాను మెరుగుపరచడానికి, నిల్వలను అక్రమంగా దాచి ఉంచడాన్ని నివారించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దిగుమతి చేసుకున్న ముడి చక్కెరను శుద్ధి చేసిన చక్కెరగా మార్చి, దేశీయ మార్కెట్లో విక్రయించడానికి దిగుమతిదారులకు మరింత సమయం ఇస్తూ ప్రభుత్వం ముడి చక్కెరపై సుంకం లేని దిగుమతులకు సంబంధించిన నిబంధనలను సవరించింది.

ఈనెల 20న జారీచేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్‌ 31 వరకు టారిఫ్‌-రేట్‌-కోటా కింద 10 లక్షల టన్నుల ముడి చక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. ధరలపై ఒత్తిడి ఉన్న తరుణంలో దేశీయ మార్కెట్లోకి అదనపు చక్కెరను తీసుకురావడమే సుంకం లేని దిగుమతి వెసులుబాటు లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News