Homeహైదరాబాద్‌Tribute | సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను భావితరాలకు అందించాలి

Tribute | సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను భావితరాలకు అందించాలి

  • టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

సామాజిక సమానత్వం కోసం పోరాడిన గొప్ప వీరుడు, ధైర్యసాహసాలకు ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ ధర్మ పరిపాలన సంస్థ, జై గౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్ర భారతి వేదికగా నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సత్యం గౌడ్, వట్టికూటి రామారావు గౌడ్, మధు గౌడ్, డాక్టర్ నాగులూరి అరుణ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News