Homeరంగారెడ్డిJawahar Nagar | బీఎల్‌ఓలకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన సమావేశం

Jawahar Nagar | బీఎల్‌ఓలకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన సమావేశం

జవహర్ నగర్, చంద్రపురి కాలనీ ప్రాంతాల పరిధిలో పనిచేస్తున్న బీఎల్‌ఓలకు ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ కమిషనర్, జవహర్ నగర్ ఏఈఆర్‌ఓ జి. రామలింగం హాజరై బీఎల్‌ఓలకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఓటరు ఫారాలను సక్రమంగా ఎలా పూరించాలి, వివరాలను నమోదు చేసే విధానం, ఫారాలు పూర్తి చేసిన అనంతరం వాటిని ఆన్‌లైన్‌లో ఎలా అప్‌లోడ్ చేయాలనే అంశాలపై ఆచరణాత్మకంగా వివరించారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి బీఎల్‌ఓ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

- Advertisement -

ఫారాల పరిశీలన, నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సందేహాలు తలెత్తిన వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలని రామలింగం తెలిపారు. ఈ సమావేశంలో జవహర్ నగర్, చంద్రపురి కాలనీ పరిధిలోని బీఎల్‌ఓలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News