Friday, July 3, 2026
Homeకెరీర్ న్యూస్Tele - MANAS | తెలంగాణలోనే పరీక్షల టెన్షన్ అధికం..

Tele – MANAS | తెలంగాణలోనే పరీక్షల టెన్షన్ అధికం..

  • 2024లో ఏకంగా లక్షకు మందికి పైగా ఆందోళన పడ్డారు..
  • టెలిమానస్ కు వెల్లువెత్తిన కాల్స్..

పరీక్షల టెన్షన్‌ బారినపడుతున్న విద్యార్థులు తెలంగాణలో ఎక్కువగా ఉన్నారు. 2024 సంవత్సరంలో ఏకంగా లక్ష మందికిపైగా విద్యార్థులు టెన్షన్‌ బారినపడ్డారు. ఈ లక్ష మంది వైద్యారోగ్యశాఖ నిర్వహిస్తున్న టోల్‌ ఫ్రీ నంబర్‌ అయిన ‘టెలిమానస్‌’ను ఆశ్రయించారు. దేశంలో ఒక్క తెలంగాణ నుంచి టెలిమానస్‌కు కాల్స్‌ వెల్లువెత్తుతున్నాయి.

భయమేస్తుందంటూ.. టెన్షన్‌ పీడిస్తుందంటూ విద్యార్థులు ఈ టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదిస్తున్నారు. ఆందోళన కలిగించే ఈ గణాంకాలను విద్యార్థుల మానసిక ఆరోగ్యం-ఆత్మహత్యల నివారణపై సుప్రీంకోర్టు నియమించిన నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ వెల్లడించింది. ఈ టాస్క్‌ఫోర్స్‌ మధ్యంతర నివేదికను ఇటీవలే సమర్పించింది. 2024 సంవత్సరంలో దేశంలో 3.6 లక్షల విద్యార్థులు టెలిమానస్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఆశ్రయించగా, వీరిలో తెలంగాణ నుంచే లక్ష మంది విద్యార్థులున్నట్టు నివేదిక వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News