Wednesday, July 1, 2026
HomeజాతీయంRebellion | జూలై 1… బ్రిటిష్ సైన్యం ఢిల్లీ ఆక్రమణకు నడుం బిగించిన దినం

Rebellion | జూలై 1… బ్రిటిష్ సైన్యం ఢిల్లీ ఆక్రమణకు నడుం బిగించిన దినం

ఆధునిక భారత దేశ చరిత్రలో 1857 సంవత్సరానికి ప్రత్యేక స్థానం ఉంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వలస పాలనకు వ్యతిరేకంగా భారతీయులు గళమెత్తిన తొలి సమిష్టి ప్రయత్నం ఇదే. చరిత్ర కారులు దీనిని “సిపాయిల తిరుగుబాటు”, “సిపాయిల పితూరి”, “ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం”, “విప్లవోద్యమం” వంటి పేర్లతో పేర్కొంటారు. ప్రముఖ రచయిత వీరసావర్కర్ తన రచన ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ (1909) లో దీన్ని తొలి స్వాతంత్ర్య యుద్ధంగా ప్రకటించారు.

ఈ తిరుగుబాటు దాదాపు వంద సంవత్సరాల బ్రిటిషు పాలన అహంకారానికి ప్రతిఘటనగా మేల్కొంది. 1757లో ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ తన ఆధిపత్యాన్ని గట్టిగా చొప్పించుకున్న కొద్ది కాలానికే భారతీయులలో వ్యతిరేకత మొదలైంది. అయితే 1856 డిసెంబర్‌లో కంపెనీ ప్రవేశ పెట్టిన రాయల్ ఎన్ఫీల్డ్ P/53 రైఫిల్ వాడకానికి సంబంధించిన అంశమే తిరుగుబాటుకు ఆశా జనకంగా మారింది.

- Advertisement -

ఈ తుపాకులకు ఉపయోగించే తూటాలను నోటితో కొరికి లోపల పెట్టాల్సి ఉండేది. అయితే అవి ఆవు, పంది కొవ్వుతో పూత పూసినవని ప్రచారం జరిగింది. దీనివల్ల హిందూ ముస్లిం సైనికుల మత భావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తూ బ్రిటిషు పాలకులు వారి మతాలను మార్చాలని కుట్ర పన్నుతున్నారన్న అభిప్రాయం బలపడింది. దీంతో నమ్మకాలు కల్లోలానికి గురై, విద్రోహం చెలరేగింది.

1857 మార్చిలో మంగళ్ పాండే అనే సైనికుడు బ్రిటిష్ అధికారి పై దాడి చేసి అరెస్ట్ చేయ బడ్డాడు. ఏప్రిల్ 8న అతనికి ఉరిశిక్ష విధించ బడింది. అతని ధైర్యం పలువురిలో చైతన్యం నింపింది. మే 10న మీరట్‌లో 11వ, 20వ అశ్వ దళాలు తిరుగు బాటుకు తెరలేపాయి. అధికారులు నిర్లక్ష్యం చేయగా… తిరుగుబాటు సుడిగాలిలా విస్తరించి పోయింది.

మే 11న తిరుగుబాటు సిపాయిలు ఢిల్లీ చేరుకొని ఎర్రకోటను ఆక్రమించారు. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్‌ను తిరుగు బాటుకు నాయకత్వం వహించాలని ఒత్తిడి చేశారు. ఆయన మొదట వెనుకాడినా, ఆపై అంగీకరించి తిరుగుబాటు దారుల చిహ్నంగా మళ్లీ ఢిల్లీ సింహాసనం మీద ఆసీనమయ్యారు. దీంతో తిరుగుబాటుకు మరింత బలం చేకూరింది.

ఢిల్లీ కేంద్రంగా తిరుగుబాటు పెను తుఫానుగా మారింది. కాన్పూర్, ఝాన్సీ, లక్నో, అలహాబాద్ వంటి నగరాల్లో తిరుగుబాటు దారులు బ్రిటిష్ అధికారులను తుడిచి. పెట్టేశారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, నానా సాహెబ్, తాంతియా తోపే వంటి నాయకులు యుద్ధ రంగంలో వీరత్వాన్ని ప్రదర్శించారు. కానీ ఆరంభంలో గందరగోళంగా ఉన్నా… తరువాత బ్రిటిష్ ప్రభుత్వం పకడ్బందీగా ప్రతిస్పందించింది. వారు చైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న పటాలాలను, క్రిమియన్ యుద్ధం నుండి మళ్లించిన యూరోపియన్ బలగాలను భారత్‌కు తరలించి తిరుగుబాటును అణిచి వేయడానికి కృషి చేశారు.

ఈ క్రమంలో ఢిల్లీ తిరిగి ఆక్రమించుకునే యత్నాన్ని జూలై 1, 1857న బ్రిటిష్ సైన్యం ప్రారంభించింది. ప్రధాన యుద్ధం ఢిల్లీకి సమీపంలోని బద్‌కీ-సరై వద్ద జరిగింది. ఆ యుద్ధంలో తిరుగుబాటు దారులు క్రమశిక్షణతో ధీటుగా పోరాడినా, బ్రిటిష్ సైనిక బలానికి ఎదుర్కోలేక ఢిల్లీకి వెనుదిరగాల్సి వచ్చింది. ఆపై వారపు దాడిలో ప్రతి వీధి, ప్రతి గల్లీ యుద్ధ రంగంగా మారింది. సెప్టెంబర్ 14న ఎర్రకోటపై దాడి చేసి బ్రిటిష్ బలగాలు నగరంలో ప్రవేశించగా, సెప్టెంబర్ 21 నాటికి చివరిగా బహదూర్ షా జఫర్ బ్రిటిష్‌లకు చెర పడ్డారు. నగరాన్ని పూర్తిగా కబళించడంలో బ్రిటిష్ వారు ఆగస్టు 31న విజయాన్ని సాధించారు.

ఈ యుద్ధంలో వేల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. నగరం శ్మశానంగా మారింది. తిరుగుబాటు నాయకుల కొంతమంది పరారైనప్పటికీ, చాలా మంది పట్టుబడి ఉరి తీయబడ్డారు. బహదూర్ షా జఫర్‌ను బర్మాకు పంపించి జీవితాంతం కారాగార జీవితం విధించారు. ఆయన కుమారులను ఎప్పుగేట్ వద్ద కాల్చి చంపారు. మొఘల్ చక్రవర్తిత్వానికి ఇదే తుది ఘట్టమైంది.

ఈ తిరుగుబాటు పూర్తిగా 1858 జూన్ 20న బ్రిటిష్ విజయంతో ముగిసినప్పటికీ, భారతీయుల గుండెల్లో తొలిసారి ‘స్వాతంత్ర్యం’ అనే భావన ఊపిరి తీసుకుంది. ఇది దేశ వ్యాప్తంగా జాతీయ చైతన్యానికి బీజం పట్టింది. ఈ పోరాటం అనంతరం ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను రద్దు చేసి, బ్రిటిష్ క్రౌన్ నేరుగా పరిపాలన చేపట్టడం జరిగింది. అప్పటి నుండి భారత దేశపు పాలనా వ్యవస్థలో మార్పులకు తావు ఏర్పడింది.

1857 తిరుగుబాటు ఓ అంతరించిన విప్లవం కాదు… అది భారత స్వాతంత్ర్య పోరాటానికి జ్ఞాపక శిలగా నిలిచింది. జూలై 1… ఢిల్లీ మీద బ్రిటిష్ దాడికి నాంది పలికిన రోజు, మన స్వాతంత్ర్య స్మృతి పటములో ఒక రక్తరేఖగా పదిలంగా నిలిచి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News