Tuesday, June 23, 2026
Homeమహబూబ్‌నగర్‌విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.

  • జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..

ప్రభుత్వ సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాలలో మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం నాగవరం శివారులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ (పెద్దమందడి బాలికల)కళాశాల ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని వంటశాల, ఆహార సామాగ్రి నిల్వ గది (స్టోర్ రూమ్)లను పరిశీలించారు. విద్యార్థినులకు అందిస్తున్న బియ్యం, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేయడంతో పాటు నిల్వ ఉంచిన వస్తువుల గడువు తేదీలను (ఎక్స్‌పైరీ డేట్స్) పరిశీలించారు.

స్టాక్ రిజిస్టర్ల నిర్వహణను తనిఖీ చేసి, వాటిని ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, డ్రై డే కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం విద్యార్థినులతో ముఖాముఖి సమావేశమై వారికి అందుతున్న ఆహారం, వసతి, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు.

- Advertisement -

విద్యార్థినుల అభిప్రాయాలను తెలుసుకొని, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినుల ఆరోగ్యం, భద్రత, విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ కళాశాల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కళాశాల ప్రిన్సిపల్, ఇతర సిబ్బంది, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News