- “ఎస్ ఐ ఆర్”లక్ష్యం నాణ్యమైన ఓటర్ జాబితా.
- వదంతులు నమ్మకుండా ఓటర్ నమోదుకు ప్రజల సహకరించాలి.
- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..
భారతదేశ పౌరులై ఒకే చోట ఓటరుగా నమోదు చేసుకోవడం ద్వారా నాణ్యమైన ఓటర్ జాబితా రూపొందించడమే “ఎస్ ఐ ఆర్” లక్ష్యమని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ మీటింగ్ హాల్లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 2002 లో చివరిసారిగా “ఎస్ ఐ ఆర్”జరిగిందని తెలిపారు.
1987 నుండి 2004 వరకు జన్మించిన వారు “ఎస్ ఐ ఆర్” ద్వారా వదంతులు నమ్మకుండా ఓటర్ నమోదుకు ప్రజలు సహకరించి ఒకే పోలింగ్ కేంద్రం లో ఓటర్ గా నమోదు చేసుకోవాలని సూచించారు. “ఎస్ ఐ ఆర్” ప్రక్రియపై విస్తృత ప్రచారం తో ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. వనపర్తి జిల్లాలో 316 పోలింగ్ స్టేషన్ లకు సంబంధించి 2 లక్షల 75 వేల 570 ఎలక్టర్స్ ఉన్నారని.. నేటికీ 2 లక్షల 24 వేల 570 కలెక్టర్స్ కు మ్యాపింగ్ పూర్తి చేశారని గుర్తు చేశారు. ఇంకా 51 వేల ఎలెక్టర్స్ మ్యాపింగ్ పూర్తికాలేదని తెలిపారు.



రెండు మూడు చోట్ల ఉన్న ఓటర్, మరణించిన వారి పేర్లు నమోదును తొలగించడానికి, నూతన ఓటరు నమోదు ప్రక్రియను ఈనెల 25 న నుండి మే 24 వరకు 316 పోలింగ్ స్టేషన్ ల ఓటరు జాబితా పై చర్యలు జరుగుతాయని అన్నారు. ఓటరుగా రెండు చోట్ల ఉన్న వారికి కూడా ఎన్యూమరేషన్ పత్రాలు ప్రతి ఓటర్ ఇంటికెళ్లి డిఎల్ఓ లు అందిస్తారని .. ఓటరు ఎనిమిరేషన్ పత్రాన్ని తమ గుర్తింపు కార్డులతో పూర్తిచేసి తనకు నచ్చిన పోలింగ్ స్టేషన్ లో ఒకే చోట నమోదు చేసుకోవాలని కోరారు.
నిబంధనలకు విరుద్ధంగా ఒక ఓటర్లు రెండు చోట్ల నమోదు చేసుకున్న.. అటువంటి చర్యలను సమర్థించిన చట్ట ప్రకారం శిక్షకు అర్హులు అవుతారని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
