Saturday, June 20, 2026
Homeరంగారెడ్డిYoga | బిఎన్ఆర్ పాఠశాలలో యోగాభ్యాసం కార్యక్రమం

Yoga | బిఎన్ఆర్ పాఠశాలలో యోగాభ్యాసం కార్యక్రమం

  • విద్యార్థులతో కలిసి యోగ చేసిన:-చైర్మన్ హనుమంత్ రెడ్డి

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కిష్టపూర్ డివిజన్ లోని బిఎన్ఆర్ పాఠశాలలో యోగాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సూర్య నమస్కారాలు, ప్రాణాయామం మరియు ధ్యానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బిఎన్ఆర్ పాఠశాల చైర్మన్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ…

విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తు, ఉన్నతమైన చదువు మరియు ఆరోగ్యకరమైన జీవనం కోసం యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. నేటి ఆధునిక కాలంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక శారీరక, మానసిక సమస్యలకు యోగా ఒక దివ్యౌషధంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News