- వెల్లడించిన డొనాల్ట్ ట్రంప్..
- ఇరాన్ కు 300 మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు వెల్లడి..
అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అయితే అణ్వాయుధాలను కలిగి ఉండబోమని ఇరాన్ అంగీకరించినట్లు సోమవారం డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇక తమ శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్‌కు 300 మిలియన్ల డాలర్ల ఇవ్వనున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ట్రంప్ తన ట్రుత్ సోషల్‌లో స్పందించారు. ఇరాన్‌తో కుదిరే డీల్‌లో.. అణ్వస్త్రాలను డెవలప్ చేయబోమని ఆ దేశం అంగీకరించనున్నట్లు ట్రంప్ చెప్పారు. ఇరాన్, అమెరికా మధ్య ఎంవోయూ కుదిరినట్లు వార్తలు వెలుబడుతున్న విషయం తెలిసిందే.
జెనీవాలో శుక్రవారం అధికారికంగా రెండు దేశాల మధ్య సంతకాలు జరిగే అవకాశం ఉన్నది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటి రోజు నుంచి స్పష్టంగా ఉన్నారని, ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండబోదని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. అణ్వాయుధ సేకరణ కోసం ఇరాన్‌కు అనుమతి ఇవ్వబోమని ఇజ్రాయల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ కూడా స్పష్టం చేశారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండవద్దు అని దశాబ్ధాలుగా పోరాటం చేస్తున్నానని, దీన్ని జీవిత మిషన్‌గా భావించానని అన్నారు. డీల్ కుదిరినా, కుదరకపోయినా, ఇరాన్ వద్ద న్యూక్లియర్ వెపన్ ఉండబోదన్నారు. ఇజ్రాయెల్ ప్రధానిగా తాను ఉన్నంత కాలం ఇలా జరగబోదన్నారు.
