Monday, June 15, 2026
HomeజాతీయంDivorce | చెంగల్పట్టు మహిళా కోర్టుకు విజయ్ విడాకుల కేసు..

Divorce | చెంగల్పట్టు మహిళా కోర్టుకు విజయ్ విడాకుల కేసు..

  • విచారణ ఆగష్టు 7వ తేదీకి వాయిదా..
  • తన పిటిషన్ లో పలు ఆరోపణలు చేసిన విజయ్ భార్య..

తమిళనాడు సీఎం, ప్రముఖ నటుడు విజయ్ ఆయన భార్య సంగీత స్వర్ణలింగం విడాకులు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ చెంగల్పట్టు మహిళా కోర్టులో విచారణ జరిగింది. ఉదయం 10:30 గంటలకు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది. విజయ్‌కి మరో నటితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ సంగీత ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ విడాకుల పిటిషన్‌ దాఖలు చేశారు. తన పిటిషన్‌లో సంగీత పలు సంచలన ఆరోపణలు చేశారు.

2021 లోనే విజయ్‌కు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని తాను గుర్తించానని, దీనిపై నిలదీసినప్పుడు ఆ బంధాన్ని తెంచుకుంటానని విజయ్ పలుమార్లు హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. అయినప్పటికీ, విజయ్ ఆ సంబంధాన్ని కొనసాగించడమే కాకుండా సదరు నటితో కలిసి విహారయాత్రలకు, ఇతర కార్యక్రమాలకు హాజరయ్యారని ఆరోపించారు. వారిద్దరూ బహిరంగ ప్రదేశాల్లో కలిసి ఉన్న ఫొటోలను ఆ నటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా తనను, తన ఇద్దరు పిల్లలు జాసన్ సంజయ్, దివ్య సాషాను తీవ్ర అవమానానికి గురిచేశారని సంగీత ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

విజయ్ తనపై ఆర్థిక ఆంక్షలు విధించారని, గతంలో ఉన్న సౌకర్యాలను ఉపసంహరించుకుని, తన స్వేచ్ఛను కూడా నియంత్రించారని సంగీత ఆరోపించారు. ఈ పరిణామాలవల్ల తాను తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యానని, ప్రత్యేక వివాహాల చట్టంలోని సెక్షన్ 27 (1)(ఏ), 27(1)(డీ) కింద తనకు విడాకులు మంజూరు చేయాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్న విజయ్, సంగీత.. తమ 26 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి ఈ కేసు విచారణ ఏప్రిల్ 20 నే జరగాల్సి ఉండగా.. వారిద్దరూ హాజరుకాకపోవడంతో జూన్ 15న తప్పనిసరిగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News