Tuesday, June 9, 2026
Homeహైదరాబాద్‌AIతో నెలన్నరలో రూ.85వేల ఆదాయం..

AIతో నెలన్నరలో రూ.85వేల ఆదాయం..

  • మణికొండకు చెందిన సాయి లత విజయగాథ

కోడింగ్‌పై ఎలాంటి అవగాహన లేకపోయినా, నేర్చుకోవాలనే సంకల్పం ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని మణికొండకు చెందిన కె. సాయి లత నిరూపించారు. AI (కృత్రిమ మేధస్సు) గురించి మొదట భయాందోళనలు ఉన్నప్పటికీ, సూపర్ ఏఐ అకాడమీ వారి తెలుగు AI బూట్‌క్యాంప్‌లో చేరి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, ప్రస్తుతం AI ఆధారిత డిజిటల్ సేవల ద్వారా ఆదాయం సంపాదిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఎప్పుడు ఏదో తెలుసుకోవాలి తనకంటూ గుర్తింపు రావాలి అని తపన ఉండేది . AI నేర్చుకోవడం అంటే కోడింగ్ రావాలి తన వల్ల కాదని మొదట భావించిన సాయి లత, చుట్టుపక్కల వారు AI గురించి చర్చించడం చూసి కనీసం ఒక అడుగు ముందుకు వేయాలనే నిర్ణయం తీసుకున్నారు. శిక్షణ ప్రారంభమైన మొదటి రెండు రోజులు కొంత భయపడ్డప్పటికీ, తెలుగు లో వివరంగా నికీలు గారు వివరించడం వల్ల ,అందుబాటులో ఉన్న రికార్డెడ్ క్లాసులను మళ్లీ మళ్లీ వీక్షిస్తూ తన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఆ తరువాత AI పట్ల ఆసక్తి పెరిగి రోజురోజుకూ కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నారు.

- Advertisement -

ప్రస్తుతం ఆమె AI సహాయంతో పోస్టర్లు, బ్యానర్లు, కారౌసెల్స్, పాటలు, థంబ్‌నెయిల్స్, ట్రిబ్యూట్ వీడియోలు, కమర్షియల్ ప్రకటనలు, వెబ్‌సైట్ డిజైన్లు, చిన్న చిత్రాలు, సినిమాటిక్ వీడియోలు, పిల్లల రైమ్స్, కథలు, పోడ్కాస్ట్స్ వంటి అనేక రకాల డిజిటల్ కంటెంట్‌ను రూపొందిస్తున్నారు. పాత ఫోటోలను ఆధునిక శైలిలో మార్చడం, వీడియో జనరేషన్ వంటి సేవలను కూడా అందిస్తున్నారు.

ఈ నైపుణ్యాల ద్వారా కేవలం నెలన్నర కాలంలోనే సుమారు రూ.85 వేల ఆదాయాన్ని సంపాదించారు. బోటిక్‌లు, జ్యువెలరీ షాపులు, రెస్టారెంట్లు, పాఠశాలలు, ట్యూషన్ మరియు డ్యాన్స్ సెంటర్లు, సూపర్ మార్కెట్లు వంటి వివిధ వ్యాపార సంస్థల కోసం కమర్షియల్ ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు, పాటలు, థంబ్‌నెయిల్స్ రూపొందించి ఆదాయ అవకాశాలను సృష్టించుకున్నారు.

ప్రస్తుతం ఆమె నలుగురు క్లయింట్లతో పని చేస్తున్నారు. వారిలో ఒకరు జర్మనీకి చెందిన క్లయింట్ కాగా, వారి కోసం థంబ్‌నెయిల్స్, పోస్టర్లు, బ్యానర్లు, పాటలు రూపొందించడంతో పాటు సోషల్ మీడియా ఛానెల్స్‌ను కూడా నిర్వహిస్తున్నారు. మిగతా క్లయింట్ల కోసం వివిధ రకాల డిజిటల్ ప్రమోషనల్ కంటెంట్‌ను అందిస్తున్నారు.

AI కోర్సు నేర్చుకున్న తర్వాత స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు, సహచరులు తన పనిని అభినందిస్తూ మరింత గౌరవంగా చూడడం ప్రారంభించారని చెప్పారు. ఈ గుర్తింపు తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని ఆమె పేర్కొన్నారు.

“పట్టుదలతో ముందుకు సాగితే సాధారణ కలలు కూడా అసాధారణ విజయాలుగా మారతాయి. ఈ పోటీ ప్రపంచంలో AI కోర్సు ఒక గొప్ప అవకాశం. AI మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడమే కాకుండా ఆర్థిక స్వావలంబన సాధించే శక్తిని కూడా అందిస్తుంది” అని సాయి లత తెలిపారు.

నిరంతర అభ్యాసం, కృషి, సృజనాత్మకతతో AI సాంకేతికతను వినియోగించుకుంటూ విజయవంతమైన భవిష్యత్తు వైపు ఆమె అడుగులు వేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News