Monday, June 8, 2026
Homeరంగారెడ్డిAwareness | తెలంగాణ ప్రజానాట్యమండలి మేడ్చల్ జిల్లా కౌన్సిల్ సమావేశం

Awareness | తెలంగాణ ప్రజానాట్యమండలి మేడ్చల్ జిల్లా కౌన్సిల్ సమావేశం

తెలంగాణ ప్రజానాట్యమండలి మేడ్చల్ జిల్లా కౌన్సిల్ సమావేశం జవహర్ నగర్‌లో కె ప్రమీల అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జూలై నెల మొదటి వారంలో జవహర్ నగర్‌లో జిల్లాస్థాయి పాటలు, నాటికల శిక్షణ శిబిరాన్ని నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.

సమావేశంలో తెలంగాణ ప్రజానాట్యమండలి మేడ్చల్ జిల్లా గౌరవాధ్యక్షులు వై. రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను కళారూపాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అధిక ధరలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, యువతపై మత్తుమందుల ప్రభావం వంటి సామాజిక సమస్యలపై పాటలు, నాటికలు రూపొందించి ప్రజల్లో చైతన్యం కల్పించే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

- Advertisement -

ఈ సమావేశంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వి వెంకటాచారి, అధ్యక్షురాలు కె ప్రమీల, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నిమ్మల నరసింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్, వైస్ ప్రెసిడెంట్ భాస్కర్, జిల్లా సహాయ కార్యదర్శి బాబు, ఉపాధ్యక్షులు రాములు, రమాతర, సైదమ్మ, నరసమ్మ, మణమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News