Thursday, May 28, 2026
Homeఅంతర్జాతీయంISI Target | యువతే లక్ష్యం..

ISI Target | యువతే లక్ష్యం..

  • రీల్స్ చేసే యూత్ పై దృష్టి పెట్టిన పాక్ ఐ.ఎస్.ఐ.
  • సున్నితమైన సమాచారాన్ని రాబడుతున్న వైనం..

భారత్‌లో గూఢచర్యం కోసం పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సరికొత్త, ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుంది. సోషల్ మీడియాలో పాప్యులారిటీ, లైకులు, ఫాలోవర్ల కోసం రీల్స్ చేసే యువతనే లక్ష్యంగా చేసుకుని వారిని గూఢచర్యం ఉచ్చులోకి లాగుతోంది. ఈ విధంగా దేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని రాబడుతోంది. గత ఏడాది కాలంలో ఇలాంటి గూఢచర్యం కేసుల్లో అరెస్టుల సంఖ్య గణనీయంగా పెరిగిందని భారత నిఘా వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

పాకిస్థాన్‌లో ఉన్న కొందరు ఐఎస్ఐ హ్యాండ్లర్లు, రిక్రూటర్లు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే, రీల్స్ చేసే వారిని నిరంతరం గమనిస్తుంటారు. వీరు వందల కొద్దీ నకిలీ ఖాతాలను సృష్టించి, లక్ష్యంగా చేసుకున్న వారి రీల్స్‌కు లైకులు, కామెంట్లు పెడుతూ ఎంగేజ్‌మెంట్ పెంచుతారు. నెమ్మదిగా వారితో సంభాషణలు మొదలుపెట్టి, మరింత మంది ఫాలోవర్లను అందిస్తామని నమ్మిస్తారు. ఈ ఆశకు చాలామంది యువత సులభంగా లొంగిపోతున్నారని ఓ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News