Thursday, May 28, 2026
HomeజాతీయంPeddi | పెద్ది సినిమా పైరసీకి మద్రాస్ కోర్టు అడ్డుకట్ట..

Peddi | పెద్ది సినిమా పైరసీకి మద్రాస్ కోర్టు అడ్డుకట్ట..

  • పైరసీ నిరోధక ఉత్తర్వులు జారీ..
  • చిత్ర నిర్మాణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందన..

రామ్ చరణ్ హీరోగా వచ్చే నెలలో విడుదలవుతున్న ‘పెద్ది’ చిత్రం ఆన్‌లైన్ పైరసీకి అడ్డుకట్ట వేయడానికి మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్నెట్‌లో ఈ చిత్రాన్ని చట్టవిరుద్ధంగా అప్‌లోడ్ చేయకూడదని, కాపీ చేయకూడదని, ప్రసారం చేయకూడదని, విడుదల చేయకూడదంటూ కోర్టు పైరసీ నిరోధక ఉత్తర్వులను జారీ చేసింది.

సినిమా కాపీరైట్‌కు సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సినిమా అనధికారికంగా ఇంటర్నెట్ ద్వారా లీక్ అయితే నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుందని కోర్టు పేర్కొంది. అందుకే ఈ సినిమాకు యాంటీ పైరసీ ఇంజంక్షన్ జారీ చేసినట్లు తెలిపింది.

- Advertisement -

కాపీరైట్ హక్కుదారులు తమ సినిమా లేదా వెబ్ సిరీస్ కంటెంట్‌లు అక్రమంగా కాపీకాకుండా, పైరసీ వెబ్ సైట్లలో ప్రసారం కాకుండా కోర్టుల ద్వారా పొందే ఒక న్యాయపరమైన రక్షణ ఉత్తర్వు ఈ యాంటీ పైరసీ ఇంజంక్షన్. ఒక వెబ్ సైట్‌ను బ్లాక్ చేసిన వెంటనే కొత్త యూఆర్ఎల్‌తో అదే కంటెంట్ రాకుండా కొత్త సైట్‌లను కూడా ఆటోమేటిక్‌గా బ్లాక్ చేయడానికి ఈ డైనమిక్ ఇంజంక్షన్ ఉత్తర్వులను కోర్టులు జారీ చేస్తుంటాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News